ఐడీఎఫ్‌సీకి బ్యాంకింగ్ లెసైన్సు జారీ

25 Jul, 2015 01:05 IST|Sakshi
ఐడీఎఫ్‌సీకి బ్యాంకింగ్ లెసైన్సు జారీ

న్యూఢిల్లీ : కొత్తగా బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు రిజర్వ్ బ్యాంక్ లెసైన్సు మంజూరు చేసినట్లు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ సంస్థ ఐడీఎఫ్‌సీ శుక్రవారం తెలిపింది. ముందుగా 20 శాఖలతో అక్టోబర్ 1 నుంచి బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో మొత్తం 25 సంస్థలు పోటీపడగా ఐడీఎఫ్‌సీ, బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాంకింగ్ లెసైన్సులు దక్కించుకున్న సంగతి తెలిసిందే. బంధన్‌కు ఆర్‌బీఐ గత నెల అనుమతులు మంజూరు చేసింది. తాజాగా బ్యాంకింగ్ లెసైన్సు లభించిన దరిమిలా ఐడీఎఫ్‌సీ షేర్లు శుక్రవారం బీఎస్‌ఈలో 2.58% పెరిగి రూ. 157.30 వద్ద ముగిశాయి.

మరిన్ని వార్తలు