బ్యాంకింగ్‌ దన్ను- ర్యాలీ షురూ

5 Jun, 2020 17:01 IST|Sakshi

సెన్సెక్స్‌ ట్రిపుల్‌ సెంచరీ

34,287 వద్ద ముగింపు

నిఫ్టీ లాభాల సెంచరీ

10,142 వద్ద ముగింపు

ఒక్కరోజులోనే తిరిగి దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ముందురోజు ఆరు రోజుల ర్యాలీకి బ్రేక్‌ పడినప్పటికీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో తిరిగి లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్‌ 307 పాయింట్లు జంప్‌చేసి 34,287 వద్ద ముగిసింది. నిఫ్టీ 113 పాయింట్లు ఎగసి 10,142 వద్ద స్థిరపడింది. ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడ్డ సెంటిమెంటు నేపథ్యంలో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గురువారం అమెరికా స్టాక్‌ ఇండెక్సులలో నాస్‌డాక్‌ సరికొత్త గరిష్టాన్ని అందుకోవడం విశేషం! కాగా.. తొలి గంటలో యథాప్రకారం మార్కెట్లు ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 34,405 వద్ద గరిష్టాన్నీ, 33,958 వద్ద కనిష్టాన్నీ తాకింది. నిఫ్టీ కూడా 10,178- 10,041 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది.

ఎఫ్‌ఎంసీజీ మాత్రమే
ఎన్‌ఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ మినహా మిగిలిన అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌ 7 శాతం జంప్‌చేయగా.. మీడియా, మెటల్‌, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, రియల్టీ, ఆటో 5-2 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, ఇన్‌ఫ్రాటెల్‌, టాటా స్టీల్‌, హిందాల్కో, ఐవోసీ, యూపీఎల్‌, గ్రాసిమ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బీపీసీఎల్‌ 14-4 శాతం మధ్య దూసుకెళ్లాయి. అయితే టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఆటో, సిప్లా, నెస్లే, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌  2-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.

ఐడియా జోరు
డెరివేటివ్స్‌లో ఐడియా, పీవీఆర్‌, ఎన్‌సీసీ, పీఎన్‌బీ, బీవోబీ, నాల్కో, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ 24-8 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. ఎస్‌ఆర్‌ఎఫ్‌, ఐజీఎల్‌, అరబిందో, మారికో, మైండ్‌ట్రీ, ఎస్కార్ట్స్‌, ఎంజీఎల్‌ 4-1.2 శాతం మధ్య డీలాపడ్డాయి. కాగా.. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1.8- 2.5 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 2053 లాభపడితే.. కేవలం 529 నష్టపోయాయి.\

ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2905 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 847 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. ఇక బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 1,851 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 782 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా