మార్కెట్‌ను నడిపిస్తున్న బ్యాంకింగ్‌, ఆటోరంగ షేర్లు

21 May, 2020 12:12 IST|Sakshi

31వేల పైకి సెన్సెక్స్‌

9150 స్థాయిని అందుకున్న నిఫ్టీ

స్వల్పలాభంతో మొదలైన మార్కెట్‌ క్రమంగా లాభాలను పెంచుకుంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, అటో రంగ షేర్ల ర్యాలీ మార్కెట్‌ను ముందుండి నడిపిస్తుంది. లాక్‌డౌన్‌ పరిమితుల సడలింపు తరువాత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోలుకుంటుందనే ఆశావహన అంచనాలు ఇన్వెసర్లను కొనుగోళ్ల వైపు మొగ్గుచూపేలా చేస్తున్నాయి. ఒకదశలో నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 9,151 స్థాయిని, సెన్సెక్స్‌ 291 పాయింట్ల లాభపడి 31,110 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. 

మరోవైపు దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల భయాలు మార్కెట్‌ను వెంటాడుతున్నాయి. నేటివరకు మొత్తంగా భారత్‌లో 1.12లక్షల కరోనా కేసులు నమోదు కాగా, 3430 మంది మృత్యువాత పడినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి.  


మిడ్‌ సెషన్‌ సమమయానికి సెన్సెక్స్‌ 240 పాయింట్ల లాభంతో 31,058 వద్ద, నిఫ్టీ 76.05 పాయింట్లు పెరిగి 9,142.60 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 2శాతం, నిఫ్టీ స్మాల్‌ క్యాప్‌ 1.50శాతం లాభపడ్డాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల అండతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1.50శాతం లాభపడింది. ఎన్‌ఎస్‌ఈ మెటల్‌ ఇండెక్స్‌ 2శాతం, నిఫ్టీ ఎన్‌ఎస్‌ఈ ఫైనాన్స్‌ సెక్టార్‌ 1.50శాతం ర్యాలీ చేశాయి. నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ అత్యధికంగా 3శాతం పెరిగింది. 


జీ లిమిటెడ్‌, హీరోమోటోకార్ప్‌, హిందాల్కో, బజాజ్‌-అటో, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 3శాతం నుంచి 3.50శాతం లాభపడ్డాయి. ఎల్‌అండ్‌టీ, అదానీ పోర్ట్స్‌, గ్రాసీం, ఎన్‌టీపీసీ, శ్రీరాం సిమెంట్స్‌ షేర్లు 1.50శాతం నుంచి 2.50శాతం నష్టాన్ని చవిచూశాయి. 

మరిన్ని వార్తలు