మరో ఏడాది పాటు అధిక కేటాయింపులే

18 Sep, 2018 02:03 IST|Sakshi

బ్యాంకింగ్‌ రంగం మొండిబాకీలపై ఇండియా రేటింగ్స్‌ నివేదిక

ముంబై: మొండిబాకీలకు  2019–20 ఆర్థిక సంవత్సరం దాకా బ్యాంకులు అధిక కేటాయింపులు కొనసాగించాల్సిన పరిస్థితి తప్పకపోవచ్చని రేటింగ్స్‌ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్‌ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు 3 శాతం దాకా ప్రొవిజనింగ్‌ చేయాల్సి ఉంటుందని తెలిపింది అర్ధ సంవత్సర అంచనాల నివేదికలో ఇండియా రేటింగ్స్‌ వివరించింది.

దీర్ఘకాలికంగా పేరుకుపోయిన మొండిబాకీలు, 2016 ఆర్థిక సంవత్సరంలో అసెట్‌ క్వాలిటీ సమీక్ష అనంతరం నాన్‌ కార్పొరేట్‌ ఖాతాల్లో పెరుగుతుండటమే ఇందుకు కారణమని వివరించింది. ప్రైవేట్‌ రంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగంలో ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాల పరిస్థితి స్థిరంగా కొనసాగనుండగా.. మిగతా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల అవుట్‌లుక్‌ ప్రతికూలంగా ఉండనుందని పేర్కొంది.   కార్పొరేట్‌ రుణాల విభాగంలో ఒత్తిడి  దాదాపు గరిష్ట స్థాయికి చేరగా .. నాన్‌–కార్పొరేట్‌ రుణాల్లో అసెట్‌ క్వాలిటీపరమైన ఒత్తిళ్లు క్రమంగా ఎగుస్తున్నాయని వివరించింది.

మరిన్ని వార్తలు