యథావిధిగా బ్యాంకులు పనిచేస్తాయి

1 Sep, 2018 00:48 IST|Sakshi

న్యూఢిల్లీ: సెప్టెంబర్‌ మొదటి వారంలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు వరుసగా ఆరు రోజులు సెలవులంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం అసత్యమని ఆర్థిక శాఖ స్పష్టంచేసింది. వచ్చేవారంలో ఉన్నటువంటి సాధారణ సెలవులు మినహా యించి మిగిలిన రోజుల్లో బ్యాంకులు, ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయని వివరించింది. సెప్టెంబర్‌ 2 (ఆదివారం), సెప్టెం బరు 8 (రెండవ శనివారం) మినహా సెలవులు లేవని స్పష్టత ఇచ్చింది.

సెప్టెంబరు 3న కృష్ణాష్టమి పండుగ కాగా, ఆ రోజున దేశవ్యాప్త సెలవులేదని.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే సెలవు ఉంటుందని వివరించింది. సెలవు రోజుల్లో ఏటీఎంలు, ఆన్‌లైన్‌ లావాదేవీలలో ఎటువంటి అంతరాయం ఉండబోదని భరోసా ఇచ్చింది. వచ్చే వారం ఏటీఎంలలో తగినంత నగదును నిర్వహించాల్సిందిగా బ్యాంకులను సూచించినట్లు వెల్లడించిన ఆర్థికశాఖ.. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక ప్రకటన ద్వారా వివరించింది.

మరిన్ని వార్తలు