స్టాక్‌ మార్కెట్లకు ముడిచమురు సెగ..

16 Sep, 2019 10:44 IST|Sakshi

ముంబై : ముడిచమురు ధరలు భగ్గుమనడం, ఆర్థిక మందగమన భయాలు స్టాక్‌ మార్కెట్‌ను వెంటాడుతున్నాయి. అమ్మకాల ఒత్తిడితో బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం నష్టాల బాట పట్టాయి. ఆసియన్‌ పెయింట్స్‌, యస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌ తదితర షేర్లు నష్టపోతున్నాయి. ఇక సెన్సెక్స్‌ 213 పాయింట్ల నష్టంతో 37,171 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 60 పాయింట్ల నష్టంతో 11,016 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని వార్తలు