భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

21 Jun, 2019 16:49 IST|Sakshi

ముంబై : స్టాక్‌ మార్కెట్లలో నిన్నటి జోష్‌ ఆవిరైంది. అమ్మకాల ఒత్తిడితో శుక్రవారం సెన్సెక్స్‌, నిఫ్టీ భారీగా నష్టపోయాయి. ట్రేడ్‌ వార్‌ భయాలతో పాటు, చమురు ధరలు పెరగడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. ఫెడరల్‌ రిజర్వ్‌ వెలువరించిన వడ్డీ రేట్ల కోత సంకేతాలు కూడా ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపలేదు.

ఆటోమొబైల్‌ సహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మొత్తంమీద 407 పాయింట్లు నష్టపోయిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 40,000 పాయింట్ల దిగువన 39,194 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక 108 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 11,724 పాయింట్ల వద్ద క్లోజయింది. యస్‌ బ్యాంక్‌, మారుతి సుజుకి, హెచ్‌డీఎఫ్‌సీ, హీరో మోటోకార్ప్‌, సన్‌ ఫార్మా తదితర షేర్లు నష్టాలతో ముగిశాయి.

మరిన్ని వార్తలు