స్టాక్‌ మార్కెట్‌పై వైరస్‌ ఎఫెక్ట్‌..

13 Feb, 2020 12:18 IST|Sakshi

ముంబై : చైనాలో కరోనా వైరస్‌ మృతుల సంఖ్య పెరగడంతో వైరస్‌ వ్యాప్తిపై భయాందోళనలు ఇన్వెస్టర్లను ప్రభావితం చేశాయి. వైరస్‌ ఆందోళనతో పాటు డిసెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి పతనమవడంతో స్టాక్‌ మార్కెట్లలో అ‍మ్మకాల ఒత్తిడి నెలకొంది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హిందుస్తాన్‌ యునిలివర్‌ షేర్లు నష్టపోతుండగా, ఎస్‌బీఐ, టైటాన్‌, ఓఎన్‌జీసీ స్వల్పంగా లాభపడుతున్నాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 196 పాయింట్ల నష్టంతో 41,369 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 53 పాయింట్ల నష్టంతో 12,147 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

చదవండి : స్టాక్‌ మార్కెట్‌లో గ్లోబల్‌ జోష్‌..

మరిన్ని వార్తలు