నోట్ల రద్దుతో తగిన ప్రయోజనాలు: ఐఎంఎఫ్‌

16 Dec, 2017 00:41 IST|Sakshi

వాషింగ్టన్‌: డీమోనిటైజేషన్‌ (పెద్ద నోట్ల రద్దు) వల్ల నగదు కటకటతో ఆర్థిక వృద్ధికి తాత్కాలిక ఇబ్బందులు ఏర్పడినప్పటికీ అవి తొలగిపోతున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్‌) పేర్కొంది. ‘‘ఏడాది క్రితం చోటు చేసుకున్న డీమోనిటైజేషన్‌తో లాభాలేంటో చూస్తూనే ఉన్నాం. అవి ఇక ముందూ కొనసాగుతాయి’’ అని ఐఎంఎఫ్‌ డిప్యూటీ అధికార ప్రతినిధి విలియం ముర్రే చెప్పారు.

మధ్య కాలానికి డీమోనిటైజేషన్‌ వల్ల చక్కని ప్రయోజనాలు సాకారమవుతాయన్న ఆయన... ఆర్థిక రంగ క్రమబద్ధీకరణ, ఆర్థిక కార్యకలాపాలపై తగిన సమాచారం, బ్యాంకింగ్‌ వ్యవస్థ, డిజిటల్‌ చెల్లింపులను మెరుగ్గా వినియోగించుకోవడం ద్వారా సమర్థవంతమైన చెల్లింపుల వ్యవస్థను ప్రయోజనాలుగా పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు