‘శామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌ 9’ విడుదల 

24 Aug, 2018 01:52 IST|Sakshi

కృత్రిమ మేధ (ఏఐ) కలిగిన అధునాతన స్మార్ట్‌ఫోన్‌ ‘గెలాక్సీ నోట్‌ 9’ మార్కెట్‌లో విడుదలైంది. స్క్రీన్‌షాట్‌ను వాయిస్‌ ద్వారా సైతం పంపగలిగే బిక్స్‌బితో అందుబాటులోకి వచ్చిన ఈ మొబైల్‌.. 6.4 అంగుళాల డిస్‌ప్లే, 845 స్నాప్‌డ్రాగ్‌ ప్రాసెసర్, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ స్పెసిఫికేషన్లను కలిగిఉన్నట్లు శామ్‌సంగ్‌ వెల్లడించింది. 128 జీబీ ధర రూ.67,900 కాగా, 512 జీబీ ఫోన్‌ ధర 84,900 ఉన్నట్లు తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచింగ్‌ను ప్రముఖ మొబైల్‌ రిటైల్‌ సంస్థలు వివిధ నగరాల్లో
అట్టహాసంగా నిర్వహించాయి. వివరాల్లోకి వెళితే.. 

హైదరాబాద్‌: హైటెక్‌సిటీ బిగ్‌ సీ షోరూంలో సీఎండీ యం బాలు చౌదరి, సినీనటి పూజా హెడ్గే ఫోన్‌ను విడుదలచేశారు. సంస్థ డైరెక్టర్లు వై. స్వప్నకుమార్, జి బాలాజి రెడ్డి, అమిత్‌విగ్‌ (సేల్స్‌అవుట్‌ హెడ్‌) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

బెంగళూరు: సంగీతా మొబైల్స్‌ స్టోర్‌లో నటి, ‘భరత్‌ అనే నేను’ ఫేమ్‌ కైరా అద్వానీ ముఖ్య అతిథిగా విచ్చేసి ‘నోట్‌ 9’ విడుదలచేశారు. ఎండీ ఎల్‌.సుభాష్‌ చంద్ర, శామ్‌సంగ్‌ ఇండియా సౌత్‌ హెడ్‌ శశి కిరణ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తిరుపతి: సెలెక్ట్‌ స్టోర్‌లో చిత్తూరు జిల్లా కలెక్టర్‌ శ్రీ ప్రద్యుమ్న ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా తొలి ముగ్గురు కస్టమర్లకు కలెక్టర్‌ చేతుల మీదుగా ఫోన్‌ అందజేసినట్లు సెలెక్ట్‌ సీఎండీ వై.గురుస్వామి నాయుడు తెలిపారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తగ్గుతున్న ఎల్‌ఐసీ ఆధిపత్యం!

తక్షణ అవరోధశ్రేణి 36,200–36,285

ద్రవ్యోల్బణం, క్యూ3 ఫలితాలతో దిశా నిర్దేశం..

ఒక పెట్టుబడి.. రెండు ప్రయోజనాలు

పండగ వేళ పెట్రో భారాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అనుష్క సినిమాలో మరో ఇద్దరు భామలు

మున్నా భాయ్‌ 3కి కష్టాలు..?

సిటీలోని టీవీ స్టార్స్‌కు ముందస్తు సంక్రాంతి..

గుర్తింపు తమిళసినిమాతోనే!

కమల్‌కు మనువడిగా శింబు?

ఆ ప్రయత్నం వర్కౌట్‌ కాలేదా?