నాణ్యమైన విద్యతోనే ఉద్యోగాలు

28 Feb, 2017 01:25 IST|Sakshi
నాణ్యమైన విద్యతోనే ఉద్యోగాలు

ఫ్యాప్సీతో ఐవైఎఫ్‌ అవగాహన
సాక్షి, సిటీబ్యూరో: యువతకు నాణ్యమైన విద్యను అందిస్తేనే మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్‌ యూత్‌ ఫెలోషిప్‌ (ఐవైఎఫ్‌) రీజినల్‌ డైరెక్టర్‌ డాంగ్‌ యాప్‌ కిమ్‌ చెప్పారు. వివిధ దేశాల్లో  మైండ్‌ ఎడ్యుకేషన్‌ వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తూ యువత అభ్యున్నతికి పాటు పడుతున్న ఐవైఎఫ్‌... సోమవారం ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీతో (ఎఫ్‌టిఏíపీసీసీఐ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ సందర్భంగా కిమ్‌ మాట్లాడుతూ...యువతకు నాణ్యమైన చదువులు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియజేశారు. ఫ్యాప్సీతో కలిసి చేపట్టే కార్యక్రమాల ద్వారా వచ్చే నిధులను యువత విద్యకు వెచ్చిస్తామని చెప్పారు. తమ సామాజిక బాధ్యతలో ఇది కూడా భాగమేనని ఫ్యాప్సీ యూత్‌ కమిటీ చైర్మన్‌ అనిరుధ్, ఐవైఎఫ్‌ డైరెక్టర్‌ జాన్‌ యోహాన్‌  తెలిపారు.

మరిన్ని వార్తలు