అడాగ్‌ షేర్ల ర్యాలీ పట్ల అప్రమత్తంగా ఉండండి

3 Jul, 2020 14:26 IST|Sakshi

మార్చి కనిష్టం నుంచి 350శాతం పెరిగిన షేర్లు 

ర్యాలీలో సత్తా లేదంటున్న నిపుణులు

అనిల్‌ అంబానీ ఆధ్వర్యంలోని అడాగ్‌ షేర్లు చాలాకాలం తర్వాత చర్చనీయాంశంగా మారాయి. మార్చి కనిష్టం నుంచి అనేక రెట్లు లాభపడంతో దలాల్‌ స్ట్రీట్‌లో ఇప్పుడు ఈ షేర్ల గురించే మాట్లాడుకుంటున్నారు. రిలయన్స్‌ పవర్‌ షేరు మార్చి 25 నుంచి జూలై1 మధ్యకాలంలో 357శాతం లాభపడింది. రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ 349శాతం, రిలయన్స్‌ క్యాపిటల్‌ షేర్లు 243 శాతం ర్యాలీ చేశాయి. ఇదే సమయంలో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లో సెన్సెక్స్‌ మాత్రమే 35శాతం పెరిగింది.

ర్యాలీలో సత్తా లేదు: 

మార్చి కనిష్టాల నుంచి అడాగ్‌ షేర్లు చేసిన ర్యాలీలో సత్తాలేదని మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. అడాగ్‌ షేర్లు నిస్సందేహంగా ర్యాలీ చేశాయని, అయితే గడిచిన 10ఏళ్లలో ఈ షేర్ల నాశనం చేసిన 98శాతం సంపద విధ్వంసంతో తాజా ర్యాలీని సరిపోల్చడం మూర్ఖత్వం అవుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  అడాగ్‌ షేర్లపై ఇప్పటికే పలు బ్రోకరేజ్‌లు, రేటింగ్‌ సంస్థలు ‘‘బేరిష్‌’’ రేటింగ్‌ను కేటాయించాయి. మార్కెట్‌ ర్యాలీలో భాగంగా ఈ షేర్లలో మూమెంట్‌ ఉన్నప్పటికీ.., వీటికీ దూరంగా ఉండటం మంచిదని సలహానిస్తున్నాయి. 

‘‘ మా ఫండమెంటల్‌ ప్రమాణాలను అందుకోలేకపోవడంతో అడాగ్‌ షేర్లపై మాకు ఎలాంటి అభిప్రాయం లేదు. అయినప్పటికీ, రిటైల్ ఇన్వెస్టర్లు అనేక పెన్నీ స్టాక్లను కొనుగోలు చేస్తున్నారని మేము నమ్ముతున్నాము. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఇన్వెస్టర్లు ఇలాంటి తప్పులు చేసిన మంచి పాఠాలు నేర్చుకుంటారు.’’ అని ఈక్వినామిక్స్‌ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ జీ.చొక్కా లింగం అభిప్రాయపడ్డారు. 

ఇటీవల అడాగ్‌ కంపెనీల్లో జరిగిన కొన్ని కార్పోరేట్‌ పరిణామాలు ఇన్వెసర్లను దృష్టిని ఆకర్షించాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ సంపూర్ణ రుణ రహిత కంపెనీగా మారుతుందని కంపెనీ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ పేర్కోన్నారు. ఈ కంపెనీకి సుమారు రూ.6వేల పైగా అప్పు ఉంది. ఈ రుణాన్ని తీర్చేందుకు కంపెనీ ఆస్తులను విక్రయప్రకియను మొదలుపెట్టింది. 

 పెన్నీస్టాకులకు దూరంగా ఉండండి: 

తక్కువ ధరల్లో లభ్యమయ్యే పెన్నీ స్టాకులకు దూరంగా ఉండటం మంచదని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. అడాగ్‌ షేర్లు మాత్రమే కాకుండా బిర్లా టైర్స్‌, ఆప్టో సర్కూ‍్యట్స్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, రుచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, జేఎంటీ అటో, అల్కేమిస్ట్‌, సింటెక్స్‌ ప్లాస్టిక్స్‌, ఆంధ్రా సిమెంట్స్‌, ఎమ్‌కోతో సుమారు 178 పెన్నీ స్టాకులు మార్చి కనిష్టం నుంచి 100శాతం నుంచి 1700శాతం ర్యాలీ చేశాయి. గత 7-8 ఏళ్లలో 1,000 కి పైగా షేర్లు స్టాక్స్ మార్కెట్‌ నుంచి వైదొలిగాయి. వాటిలో ఎక్కువ భాగం పెన్నీ స్టాక్స్ కావడం విశేషం. గడచిన ఆరేళ్లలో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు పెన్సీ స్టాక్‌ల ద్వారా రూ.1.5 - రూ.2లక్షల కోట్లను నష్టపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.  


మార్కెట్లో బలమైన లిక్విడిటీ ఉన్న కారణంగా చాలా పెన్నీ స్టాక్‌ పెరిగాయి. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఇన్వెస్టర్లు ఎలాంటి ఫండమెంట్లను పట్టించుకోకుండా తక్కువ ధరలో లభ్యమయ్యే షేర్లను కొనుగోలు చేస్తున్నాయి. వారిని రాబిన్‌హుడ్‌ ఇన్వెసర్లు అని పిలవచ్చు. అడాగ్‌తో సహా అంలాంటి కౌంటర్లలో కొనుగోలు జరపకపోవడం మంచింది.’’ అని సామ్‌కో సెక్యూరిటీస్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా తెలిపారు. 

మరిన్ని వార్తలు