బస్టాండ్, రైల్వే స్టేషన్లలో సెల్ చార్జింగ్ పెడుతున్నారా?

13 Jun, 2016 12:57 IST|Sakshi
బస్టాండ్, రైల్వే స్టేషన్లలో సెల్ చార్జింగ్ పెడుతున్నారా?

బయట ప్రాంతాలకు వెళ్లినప్పుడు మీకు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర పబ్లిక్ ప్రదేశాల్లో ఉండే చార్జర్లతో మీ మొబైల్ ను చార్జ్ చేసుకునే అలవాటు ఉందా? ఉంటే, ఇక ముందు అలా చేయకండి. చార్జింగ్ పెట్టిన ఫోన్ల లో నుంచి సమాచారాన్ని తస్కరించే మొబైల్ చార్జర్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. ఇవి మీ సమాచారాన్ని తస్కరిస్తున్నాయన్న విషయం కూడా మీకు తెలియదంటే నమ్మండి.. వీటిని ఎంత జాగ్రత్తగా తయారు చేశారో..!

సమాచారం ఎలా దొంగతనానికి గురవుతుంది

మామూలు చార్జర్ల మాదిరి కాకుండా ఇలాంటి చార్జర్లలో ఒక ప్రత్యేకమైన సర్క్యూట్ ను అమర్చుతారు. ఒకసారి ఫోన్ ను ఈ చార్జర్ తో చార్జింగ్ పెట్టిన తర్వాత సర్క్యూట్ యాక్టివేట్ అయ్యి ఫోన్ ను యూఎస్బీ ఓటీజీ మోడ్ లోకి తీసుకెళ్లిపోతుంది. ఈ తరహా మోడ్ యాక్టివేట్ అవగానే సమాచారాన్ని తస్కరించాలనుకునే వ్యక్తి ఇంటర్ నెట్ ద్వారా లేదా రేడియో ఫ్రీక్వెన్సీసిగ్నల్స్ ద్వారా ఫోన్ లోని డేటాను కాపీ చేసుకుంటారు. ఈ ప్రక్రియ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నా జరుగుతుందంటే ఎంత పకడ్బందీగా హ్యాకర్లు ఈ వ్యవస్థను రూపొందించారో ఆలోచించండి.

ఈ విధంగా పనిచేసే ఈ డివైజ్ పేరు 'మీమ్' దీనిని మొబైల్స్ నుంచి డేటాను ట్రాన్స్ ఫర్ చేయడానికి, చార్జింగ్, బిల్ట్ ఇన్ స్టోరేజ్ తదితరాలను రూపొందించారు. కొత్తగా స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసి ఉపయోగించుకునే వారి సౌకర్యార్ధం వీటిని మార్కెట్ లోకి ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 16, 32 జీబీల వేరింయట్లలో ఆన్ లైన్ లో లభ్యం అవుతోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా