వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతా: అమెజాన్‌ సీఈఓ

6 Jun, 2020 20:42 IST|Sakshi

ముంబై: అమెజాన్‌ బ్యానర్‌లో నల్లజాతీయులకు మద్దతుగా వేసిన ప్రకటన(Black lives Matter)  కొందరికి బాధ కలిగించింది.  నల్ల జాతీయులకు మద్దతుగా ప్రకటన వేయడం పట్ల అమెజాన్ సీఈఓ జెఫ్‌ బిజోస్‌పై మెసీ అనే అభిమాని అసహనం వ్యక్తం చేశాడు. మెసీ మాట్లాడుతూ.. తాను అందరి అభిప్రాయాలను చెబుతున్నానని.. అమెజాన్‌ కంపెనీ ఈ స్థాయిలో వృద్ధి చెందడానికి అన్ని వర్గాల సహకారం ఉందని అన్నారు. నల్లజాతీయులకు మద్దతుగా(Black lives Matter)బదులు అందరు జీవించాలి(All Lives Matter) అనే నినాదానికి ప్రాధాన్యం ఇవ్వాలని బెజోస్‌ను కోరారు.

బెజోస్‌ స్పందిస్తూ.. తన అభిమాని మెసీ ఆరోపణను వ్యతిరేకిస్తానని, నల్లజాతీయులకు మద్దతుగా ప్రకటన వేశానంటే వేరే వారిని పట్టించుకోనని అర్థం కాదంటూ మెసీకి కౌంటర్‌ ఇచ్చాడు. ఎవరి వ్యక్తిగత అనుభవాల ఆధారంగా వారు జీవిస్తుంటారని.. కాగా కొన్ని జాతులు, రంగుల వారు సమాజంలో వివక్షకు గురవుతున్నారని, వారికి మద్దతుగా తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని బెజోస్‌ అన్నారు. అందరు బాగుండాలనే కోరుకుంటానని.. తాను అందరి వాడినని జెఫ్‌ బిజోస్ స్పష్టం చేశాడు.‌

చదవండి: అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు

మరిన్ని వార్తలు