భారతి సిమెంట్‌ ‘ఎక్స్‌ప్రెస్‌ డెలివరీ’ ప్రారంభం

23 Nov, 2017 00:41 IST|Sakshi

కడప కల్చరల్‌: డీలర్లకు సిమెంటును అతి తక్కువ సమయంలో సరఫరా చేసేందుకు  భారతి సిమెంట్‌ ‘గ్రీన్‌ చానల్‌ ఎక్స్‌ప్రెస్‌ డెలివరీ’ని ప్రారంభించింది.  వైఎస్సార్‌ జిల్లాలోని భారతి సిమెంట్‌ కర్మాగారంలో బుధవారం ఈ కార్యక్రమాన్ని సంస్థ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎంసీ మల్లారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కర్మాగారం నుంచి సిమెంట్‌ను డీలర్లకు వేగంగా సరఫరా చేసేందుకు గ్రీన్‌ చానల్‌ ఎక్స్‌ప్రెస్‌ డెలివరీని రాయలసీమ ప్రాంతంలో తొలిసారిగా అమలు చేస్తున్నామన్నారు. దీనివల్ల డీలర్లు కస్టమర్లకు చెప్పిన సమయానికే సిమెంటు అందజేయవచ్చని తెలిపారు.

అనుకున్న సమయం కంటే సిమెంటును ముందే అందజేయడంతో కస్టమర్ల విశ్వాసాన్ని చూరగొనేందుకు ఈ పద్ధతి ఎంతైనా ఉపయోగపడగలదన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్‌ డీజీఎం కేఆర్‌ వెంకటేశ్, లాజిస్టిక్స్‌ ఏజీఎం సౌరభ్‌ పురువార్, మార్కెటింగ్‌ ఏజీఎం ఎంఎన్‌ రెడ్డి, మార్కెటింగ్‌ సీనియర్‌ మేనేజర్‌ ఎ.ప్రతాప్‌రెడ్డి, హెచ్‌ఆర్‌ ఏజీఎం రవీంద్రకుమార్, ట్రాన్స్‌పోర్టు యజమానులు మహేందర్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, బీవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు