లాభాల్లోకి భారతీ ఆక్సా జనరల్‌ ఇన్సూరెన్స్‌ 

12 Dec, 2018 01:47 IST|Sakshi

ముంబై: భారతీ ఆక్సా జనరల్‌ ఇన్సూరెన్స్‌ (భారతీ ఎంటర్‌ప్రైజెస్, ఆక్సా గ్రూపు జాయింట్‌ వెంచర్‌) 2018–19వ ఆర్థిక సంవత్సరం తొలి అర్థ సంవత్సర కాలానికి లాభాలార్జించినట్లు ప్రకటించింది. 2018 ఏప్రిల్‌– సెప్టెంబర్‌ మధ్య ప్రీమియం ఆదాయం 38 శాతం పెరిగి రూ.1,087 కోట్లుగా నమోదయిందని, అంతకుముందు ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో ఇది రూ.788 కోట్లు మాత్రమేనని కంపెనీ తెలిపింది.

కంబైన్డ్‌ రేషియో (మొత్తం ప్రీమియం ఆదాయంలో క్లెయిమ్స్, ఖర్చులు పోను లాభదాయకతను తెలియజేసేది) 15 శాతం మెరుగుపడి అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న 131.6 శాతం నుంచి 116.5 శాతానికి చేరినట్టు భారతీ ఆక్సా జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవో సంజీవ్‌ శ్రీనివాసన్‌ తెలిపారు.   

>
మరిన్ని వార్తలు