ఎయిర్‌టెల్‌ యూజర్లకు 3 నెలలు నెట్‌ఫ్లిక్స్‌ ఫ్రీ

28 Aug, 2018 01:15 IST|Sakshi

న్యూఢిల్లీ: వీడియో స్ట్రీమింగ్‌ సర్వీసులందించే అమెరికన్‌ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో దేశీ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద తమ పోస్ట్‌పెయిడ్, వి–ఫైబర్‌ హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్క్రయిబర్స్‌ మూడు నెలల పాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చని ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఆ వ్యవధి దాటిన తర్వాత నుంచి ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌ లేదా హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ బిల్లులోనే నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ చెల్లించవచ్చని పేర్కొంది.

ఎయిర్‌టెల్‌ టీవీ యాప్‌లో ప్రత్యేకంగా నెట్‌ఫ్లిక్స్‌ కంటెంట్‌ను కూడా పొందవచ్చునని భారతీ ఎయిర్‌టెల్‌ ఎండీ గోపాల్‌ విఠల్‌ తెలిపారు. గౌల్, స్ట్రేంజర్‌ థింగ్స్, సేక్రెడ్‌ గేమ్స్‌ వంటి తమ కంటెంట్‌ను మొబైల్‌ ఫోన్లపై వీక్షించే వారి సంఖ్య పెరుగుతోందని, ఇవన్నీ కూడా ఎయిర్‌టెల్‌ మొబైల్, బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌లపై అందించనున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ గ్లోబల్‌ హెడ్‌ ఆఫ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ బిల్‌ హోమ్స్‌ వివరించారు. ఎయిర్‌టెల్‌ టీవీ ఇప్పటికే 10,000 పైచిలుకు సినిమాలు, టీవీ షోలతో పాటు 375 పైగా లైవ్‌ టీవీ చానల్స్‌ను అందిస్తోంది.

మరిన్ని వార్తలు