ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్...

18 Nov, 2016 00:28 IST|Sakshi
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్...

డిసెంబర్‌లో సేవలు షురూ..!
మారుమూల పల్లెలకూ సర్వీసులు
కోటక్ మహీంద్రాతో కలసి కార్యకలాపాలు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ భారతి ఎయిర్‌టెల్ త్వరలో పేమెంట్స్ బ్యాంక్ సేవలను ప్రారంభిస్తోంది. డిసెంబర్‌లోనే ఈ సర్వీసులను మొదలు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నామని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. వాస్తవానికి జూలై-సెప్టెంబర్‌లో ఆరంభించాలని అనుకున్నప్పటికీ ప్రారంభ తేదీ వారుుదా పడుతూ వస్తోంది. పేమెంట్స్ బ్యాంకు సేవలను అందించేందుకు కోటక్ మహీంద్రా బ్యాంకుతో ఎరుుర్‌టెల్ చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఎరుుర్‌టెల్ అనుబంధ కంపెనీ అరుున ఎరుుర్‌టెల్ ఎం-కామర్స్ సర్వీసెస్ (ఏఎంఎస్‌ఎల్) 2016 ఏప్రిల్‌లో ఆర్‌బీఐ నుంచి లెసైన్సును దక్కించుకుంది. దేశంలో పేమెంట్స్ బ్యాంకు లెసైన్సును పొందిన తొలి కంపెనీ ఏఎంఎస్‌ఎల్ కావడం విశేషం.

మారుమూల పల్లెల్లో సేవలు..: పేమెంట్స్ బ్యాంకులో సేవింగ్‌‌స, డిపాజిట్, పేమెంట్, రెమిటెన్సు సేవలను ఆఫర్ చేస్తారు. మారుమూల పల్లెల్లో ఉన్న లక్షలాది మందికి ఆర్థిక సేవలు అందించేందుకు కోటక్ మహీంద్రా బ్యాంకు అనుభవం ఎరుుర్‌టెల్‌కు దోహదం చేయనుంది. దేశవ్యాప్తంగా ఎరుుర్‌టెల్‌కు 26 కోట్లకుపైగా మొబైల్ చందాదారులు ఉన్నారు. 15 లక్షలకుపైగా కేంద్రాల ద్వారా ఎరుుర్‌టెల్ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. దేశంలో 87% జనాభాకు టెలికం కవరేజ్‌ను విస్తరించింది. బ్యాంకింగ్ రంగంలో కొత్త కస్టమర్లను దక్కించుకోవడానికి ఇరు బ్రాండ్లకు ఉన్న పాపులారిటీ ఉపయోగపడుతుంది. 2011 నుంచి ఎరుుర్‌టెల్ మనీ సేవలు అందిస్తున్న ఏఎంఎస్‌ఎల్ పేరును ఈ ఏడాది మే నెలలో ఎరుుర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌గా మార్చారు.

మరిన్ని వార్తలు