65శాతం తగ్గిన ఎయిర్‌టెల్‌ లాభాలు : అయినా ఓకే

25 Oct, 2018 17:20 IST|Sakshi

సాక్షి, ముంబై: టెలికాం కంపెనీ భారతి ఎయిర్‌టెల్‌ క్యూ2 ఫలితాల్లో మార్కెట్‌ వర్గాలను మెప్పించింది.  ముఖ్యంగా మార్కెట్‌ లోని పోటీ వాతావరనం, ఇంధన ధరల కారణంగా ఎయిర్‌టెల్‌కు భారీ నష్టం తప్పదని అంచనా  వేసింది.  వార్షిక ప్రతిపాదికన 65 శాతం క్షీణించి 119కోట్లు నికర లాభాలకు పరిమితమైంది. దాదాపు 800  కోట్ల రూపాయల  మేర ఎయిర్‌టెల్‌ నష్టపోనుందని ఎనలిస్టులు భావించారు. ఆదాయం కూడా 6.2 శాతం క్షీణించి 20,442 కోట్లను సాధించింది. వాల్యూమ్‌ గ్రోత్‌ కూడా మెరుగ్గా  నమోదు చేసింది.

ఏఆర్‌పీయూ (యావరేజ్‌ రెవన్యూ పెర్‌  యూజర్‌) కూడా  అంచనాలను మించి నమోదు కావడం ఎయిర్‌టెల్‌కు అనుకూలం అంశమని విశ్లేషకులు అంటున్నారు.  ఇది 28.80 క్షీణించి 101 రూపాయలుగా నిలిచింది.  ఉంది. ఇది గత ఏడాది 142గా  ఉంది. జియో ఎంట్రీతో ఆర్‌పీయూ మరింత దిగజారుతుందని  మార్కెట్‌వర్గాలు అంచనా వేశాయి.  అలాగే గత   సరసమైన ధరలు కంటెంట్ పార్టనర్షిప్ల ద్వారా నాణ్యమైన కస్టమర్లపై దృష్టి సారించామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విటల్ అన్నారు. ఏఆర్‌పీయూ  క్షీణత ఈ త్రైమాసికానికి మితంగా ఉందని తెలిపారు. మరోవైపు భారీ నష్టాలతో ముగిసిన ఇవాల్టి ఈక్విటీ మార్కెట్‌లో భారతి ఎయిర్‌టెల్‌ 6.28శాతం నష్టపోయింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా