3.5 శాతం పతనమైన ఎయిర్‌టెల్‌ షేరు

26 May, 2020 10:45 IST|Sakshi

టెలికం దిగ్గజం భారతీఎయిర్‌టెల్‌ షేరు మంగళవారం దాదాపు 3.55 శాతం పతనమైంది. రూ.572 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించి రూ. 568, రూ. 576 మధ్య కదలాడి ప్రస్తుతం రూ. 572.15(ఉదయం 10.38కి) వద్ద ట్రేడవుతోంది. కంపెనీలో 2.75 శాతం వాటాకు సమానమైన, వంద కోట్ల డాలర్ల విలువైన షేర్లను ప్రమోటర్‌ భారతీ టెలికం విక్రయిస్తుందన్న వార్తలు ఎయిర్‌టెల్‌ షేరుపై ప్రభావం చూపాయి. రూ. 558 వద్ద బ్లాక్‌డీల్‌లో ఈ విక్రయం జరుగతుందని సోమవారం వార్తలు వచ్చాయి. ఇది శుక్రవారం ముగింపు రేటుకు దాదాపు 6 శాతం తక్కువ. విక్రయంలో భాగంగా దాదాపు 15 కోట్ల షేర్లు చేతులు మారుతున్నాయని తెలిసింది. ఈ వార్తలను ఎయిర్‌టెల్‌ నిర్ధారించలేదు. పలు ఎంఎఫ్‌లు, విదేశీ మదుపరులకు ఈ షేర్లు అమ్ముతున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిర్‌టెల్‌లో భారతీ టెలికంకు 38.79 శాతం వాటా ఉంది, అమ్మకానంతరం ఈ వాటా 26 శాతానికి దిగిరానుంది. కంపెనీలో ప్రమోటర్లందరికీ కలిపి 59 శాతం వాటా ఉంది. భారతీ టెలికంలో భారతీ ఎంటర్‌ప్రైజెస్‌, సింగ్‌టెల్‌కు మెజార్టీ వాటాలున్నాయి. 

>
మరిన్ని వార్తలు