రూ.3500 కోట్లను సమీకరించిన భారతీ ఎయిర్‌టెల్‌

23 May, 2020 11:38 IST|Sakshi

దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ హోల్డింగ్‌ కంపెనీ భారతీ టెలికాం రూ.3500 కోట్లను సమీకరించింది. వాణిజ్య పేపర్ల జారీ చేయడం ద్వారా ఈ మొత్తం నిధులను సమీకరించినట్లు కంపెనీ ఒక ప్రకనటలో తెలిపింది. 3నెలల మెచ్యూరిటితో సగటున 6.16శాతం ఆఫర్‌ చేసింది. సమీకరించిన నిధులను రుణాల చెల్లింపులకు, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలను తీర్చడానికి వినియోగిస్తామని కంపెనీని తెలిపింది. ‘‘రేట్ల మేన్‌జ్‌, ఇప్పటికే ఉన్న పోర్ట్‌ఫోలియో రీఫైనాన్సింగ్ నిర్వహించడానికి కంపెనీ చేసే సాధారణ ట్రెజరీ కార్యకలాపాలు ఇవి.’’ అని భారతీ గ్రూప్‌ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. 

క్యూఐపీ, ఓవర్సీస్ కన్వర్టబుల్‌ బాండ్ల జారీతో ఇప్పటికే ఈ ఏడాదిలో భారతీ ఎయిర్‌టెల్‌  3బిలియన్‌ డాలర్లను సమీకరించింది. ఎయిర్‌టెల్‌లో భారతి టెలికాం 38.79 శాతం వాటాను కలిగింది. మార్చి 31 ముగిసిన త్రైమాసికం నాటికి కంపెనీకి మొత్తం రూ.88,251 కోట్ల  నికర రుణాన్ని కలిగి ఉంది. లీజ్‌ ఆబ్లికేషన్‌తో కలుపుకుంటే కం‍పెనీ మొత్తం రుణాలు రూ.1.18లక్షల కోట్లకు చేరుకుంటుందని కంపెనీ తెలిపింది.

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం... ఏప్రిల్ 17, మే 15 మధ్య తేదిల్లో 3 నెలల కమర్షియల్‌ పేపర్ల వడ్డీ రేట్లపై 220 బేసిస్ పాయింట్లు తగ్గాయి. ఆర్బీఐ ఈ శుక్రవారం మే 22న పాలసీ రేటును శుక్రవారం 40 బేసిస్ పాయింట్లు తగ్గించిన తరువాత కమర్షియల్‌ పేపర్లపై వడ్డీ రేటు మరింత తగ్గే అవకాశం ఉంది. భారతీ ఎయిర్‌టెల్‌ సమీకరించిన మొత్తం నగుదు ప్రధానంగా స్వల్పకాలిక ఫైనాన్సింగ్‌ అవసరాలను తీర్చేందుకు, ఇప్పటికే ఉన్న అప్పుల చెల్లింపులకు వినియోగించే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు రోహణ్‌ దమీజా తెలిపారు. 

మరిన్ని వార్తలు