మెట్రో కోచ్‌ల తయారీలోకి భెల్‌!

13 Jun, 2018 00:26 IST|Sakshi

లిథియమ్‌–అయాన్‌ బ్యాటరీల తయారీ రంగంలోకి కూడా  

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కంపెనీ భెల్‌ మెట్రో రైలు కోచ్‌ల తయారీరంగంలోకి ప్రవేశించనున్నదని కేంద్ర మంత్రి అనంత్‌ గీతే తెలిపారు. భారత్‌లో నాలుగు విదేశీ కంపెనీలతో కలిసి లిథియమ్‌–ఆయాన్‌ బ్యాటరీలను తయారు చేసే సాధ్యాసాధ్యాలపై ఈ కంపెనీ కసరత్తు చేస్తోందని ఆయన వివరించారు. 

ప్రజా రవాణాకు ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉపయోగించడానికి ఉద్దేశించిన ఫేమ్‌ ఇండియా రెండో దశ సెప్టెంబర్‌ తర్వాత ప్రారంభమవుతుందని ఒక పత్రికా సమావేశంలో ఆయన చెప్పారు. ఫేమ్‌ రెండో దశ అమలు కోసం రూ.9,300 కోట్లు కేటాయించాలని బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉన్నాయని, దీంట్లో రూ.1,000 కోట్లు ఛార్జింగ్‌ సదుపాయాల కోసం వెచ్చించనున్నట్లు తెలిపారు. లిథియమ్‌ అయాన్‌    జేవీలో 20% వాటా భెల్‌కు, మిగిలిన 80%వాటా ఆ నాలుగు కంపెనీలకు ఉంటాయని తెలిపారు.

మరిన్ని వార్తలు