బీహెచ్‌ఈఎల్‌కు స్వేచ్చ- చైనాకు చెక్‌

18 Jun, 2020 15:28 IST|Sakshi

ప్రయివేటైజేషన్ లేదా మరింత అటానమీ ఇస్తే..

ఆత్మనిర్బర్‌ ఇండియాకు మద్దతివ్వగలదు

ప్రపంచంలోనే ఉత్తమ విద్యుత్‌ ప్లాంట్లకు చాన్స్‌

వేదాంతా చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ ట్వీట్‌

16 శాతం దూసుకెళ్లిన బీహెచ్‌ఈఎల్‌ షేరు

విద్యుత్‌ పరికరాల తయారీ దిగ్గజం భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌(బీహెచ్‌ఈఎల్‌)కు మరింత స్వేచ్చ(అటానమీ) ఇస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ పవర్‌ ప్లాంట్లను రూపొందించగలదని బిలియనీర్ పారిశ్రామికవేత్త అనిల్‌ అగర్వాల్‌ తాజాగా ట్వీట్‌ చేశారు. అటానమీ లేదా ప్రయివేటైజేషన్ చేపడితే.. బీహెచ్‌ఈఎల్‌ ఆత్మనిర్బర్‌ ఇండియాకు గొప్ప మద్దతునివ్వగలదని డైవర్సిఫైడ్‌ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌ చైర్మన్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న డిమాండ్‌కు అనుగుణంగా  విద్యుత్‌ ప్లాంట్లను అందించగల సత్తా కంపెనీకి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. తద్వారా చైనా ప్రొడక్టులపై ఆధారపడటాన్ని మానుకోవచ్చని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా టర్న్‌కీ పద్ధతిలో విదేశాలలో సైతం పవర్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేయగలదని తెలియజేశారు. చైనాతో లడఖ్‌ సమీపంలో సైనిక వివాదం తలెత్తిన నేపథ్యంలో అనిల్‌ అగర్వాల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. 

క్యూ4 వీక్‌
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో బీహెచ్‌ఈఎల్‌ రూ. 1534 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 676 కోట్ల నికర లాభం ఆర్జించింది. కాగా.. ప్రస్తుతం బీహెచ్‌ఈఎల్‌ షేరుకి భారీ డిమాండ్‌ కనిపిస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 16 శాతం దూసుకెళ్లి రూ. 32 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్‌ పరిమాణం సైతం నాలుగు రెట్లు ఎగసింది. బీఎస్‌ఈలో 2 కోట్ల షేర్లు చేతులు మారడం విశేషం! 

>
మరిన్ని వార్తలు