Appకీ కహానీ...

9 Jan, 2017 03:03 IST|Sakshi
Appకీ కహానీ...

భీమ్‌...
మొబైల్‌ ఫోన్‌ ద్వారా వేగంగా, సరళంగా, సులభంగా, భద్రంగా ఆర్థిక లావాదేవీలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘భీమ్‌’ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కొద్ది రోజుల కిందట ప్రధాని నరేంద్రమోదీ దీన్ని స్వయంగా ఆవిష్కరించారు. భీమ్‌ అంటే భారత్‌ ఇంటర్‌ఫేస్‌ ఫర్‌ మనీ. ఈ యాప్‌ యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ)తో, బ్యాంక్‌ అకౌంట్లతో అనుసంధానమై పనిచేస్తుంది. భీమ్‌ యాప్‌ను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) అభివృద్ధి చేసింది. దీన్ని గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ప్రత్యేకతలు
బ్యాంక్‌ అకౌంట్‌తో అనుసంధానమై ఉన్న మొబైల్‌ నంబర్‌తో భీమ్‌ యాప్‌లో రిజిస్టర్‌ అవ్వాలి. ఇక్కడ మీ సిమ్‌ కార్డులో ఎస్‌ఎంఎస్‌ చార్జీకి సరిపడా బ్యాలెన్స్‌ ఉండాలి. అప్పుడే వెరిఫికేషన్‌ అవుతుంది.

మొబైల్‌ నంబరే పేమెంట్‌ అడ్రస్‌. దీనికి అదనంగా వేరొక కస్టమ్‌ పేమెంట్‌ అడ్రస్‌ను కూడా క్రియేట్‌ చేసుకోవచ్చు.

కేవలం మొబైల్‌ నంబర్‌ ద్వారానే కుటుంబ సభ్యులు, స్నేహితులు, కస్టమర్ల నుంచి సులభంగా డబ్బులను పొందొచ్చు. అలాగే వారికి డబ్బుల్ని పంపొచ్చు.

బ్యాలెన్స్‌ను చెక్‌ చేసుకోవచ్చు. లావాదేవీల వివరాలు పొందొచ్చు.

పేమెంట్‌ అడ్రస్‌ను వేగంగా ఎంట్రీ చేయడం కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ ఫీచర్‌ కూడా అందుబాటులో ఉంది.

ఒకేసారి రూ.10,000 పంపొచ్చు. రోజుకు రూ.20,000 వరకు లావాదేవీలు నిర్వహించే అవకాశం ఉంది.

త్వరలో ఇది ఆధార్‌కు అనుసంధానమై వేలిముద్రల ద్వారా కూడా పనిచేసే అవకాశం ఉంది. అయితే దానికన్నా ముందు జనం తమ ఖాతాల్ని ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఈ యాప్‌ సేవలు ఇంగ్లిష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వార్తలు