భీమ్‌ యస్‌ పే

6 Nov, 2017 01:28 IST|Sakshi

ప్రైవేట్‌ రంగంలోని ‘యస్‌ బ్యాంక్‌’ వినియోగదారుల కోసం ‘భీమ్‌ యస్‌ పే’ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది ఒక స్మార్ట్‌ పేమెంట్‌ యాప్‌. దీన్ని గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ప్రత్యేకతలు

భీమ్‌ యస్‌ పే యాప్‌ను ఉపయోగించాలనుకుంటే మీరు యస్‌ బ్యాంక్‌ కస్టమరే కానక్కర్లేదు.
 యూపీఐ: డబ్బుల్ని పంపొచ్చు. పొందొచ్చు. అకౌంట్‌లో బ్యాలెన్స్‌ ఎంత ఉందో చూడొచ్చు. గత లావాదేవీల వివరాలు తెలుసుకోవచ్చు. –
  వర్చువల్‌ కార్డ్‌: యస్‌ పే యూజర్లు ఉచిత వర్చువల్‌ కార్డును పొందొచ్చు. దీని సాయంతో ఈ–కామర్స్‌ సైట్లలో చెల్లింపులు చేయవచ్చు.
  భారత్‌ క్యూఆర్‌ ఫీచర్‌ అందుబాటులో ఉంది.
యస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్స్‌: యస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులను లింక్‌ చేసుకొని, అకౌంట్‌ను మేనేజ్‌ చేసుకోవచ్చు. అంటే కార్డ్‌ బిల్లులు చెల్లించొచ్చు. స్టేట్‌మెంట్లు పొందొచ్చు. కార్డ్‌ను బ్లాక్‌ చేసుకోవచ్చు.
 యస్‌ బ్యాంక్‌ సహా ఇతర బ్యాంకుల ఖాతాల నుంచి డెబిట్‌ కార్డు లేదా నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా వాలెట్‌లోకి డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు.
 డీటీహెచ్‌తోపాటు ప్రి–పెయిడ్‌ మొబైల్‌ రీచార్జ్‌లను నిర్వహించుకోవచ్చు. ఇతర బిల్లులు చెల్లించొచ్చు.
 ప్రతి ట్రాన్సాక్షన్‌పై రివార్డు పాయింట్లను పొందొచ్చు.

మరిన్ని వార్తలు