స్పెక్ట్రం డీల్‌ : అంబానీకి భారీ ఊరట

30 Nov, 2018 12:22 IST|Sakshi

స్పెక్ట్రం డీల్‌:  ఆర్‌కాంకు సుప్రీం ఊరట

 కార్పొరేట్‌ గ్యారంటీగా రూ.1400కోట్లు చెల్లించాలి -సుప్రీం

సాక్షి, న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌(ఆర్‌కాం)కు సుప్రీంకోర్ టుభారీ ఊరట కల్పించింది.  సోదరుడు  ముకేశ్‌ అంబానీకి చెందిన టెలికాం సంస్థ జియోకు స్పెక్ట్రం అమ్మకానికి  సంబంధించి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తద్వారా జియోకు ఆస్తుల అమ్మకానికి సంబంధించిన అడ్డంకులను అత్యున్నత న్యాయస్థానం  తొలగించింది. అయితే  గ్యారంటీ నగదు చెల్లించిన  తరువాత మాత్రమే తుది ఆమోదం లభిస్తుందంటూ నిబంధన విధించింది. డాట్‌​ వద్ద గ్యారంటీ నగదు చెల్లించిన అనంతరం నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్ లభిస్తుందని సుప్రీకోర్టు స్పష్టం చేసింది.

సేల్‌కున్నఅడ్డంకులను తొలగిస్తూ సుప్రీం శుక్రారం కీలక తీర్పునిచ్చింది. రెండు రోజుల్లో 1400 కోట్ల  రూపాయల కార్పొరేట్‌ గ్యారంటీ  చెల్లించాలని స్పష్టం చేసింది.  ఈ మొత్తం  చెల్లించిన అనంతరం వారం రోజుల్లో ఎన్‌వోసీ జారీ చేయాల్సిందిగా టెలికాం విభాగం (డాట్‌)ను సుప్రీం కోరింది.  

రూ.46వేల కోట్ల రుణభారం
అప్పుల భారం నుంచి బయటపడేందుకు వైర్‌లెస్‌ స్పెక్ట్రం, టవర్, ఫైబర్‌, మీడియా కన్వర్జెన్స్ నోడ్ (ఎంసిఎన్) ఆస్తులను జియోకు విక్రయించేందుకు ఆర్‌కాం సిద్ధమైంది. సుమారు రూ.46వేల కోట్ల రుణభారాన్ని తగ్గించుకునే వ్యూహంలో  స‍్పెక్ట్రం ఆస్తుల అమ్మకం ఆర్‌కాంకు చాలా ముఖ్యం.

మరిన్ని వార్తలు