ఇండస్ట్రియల్ గ్యాస్ రేటు18% తగ్గింపు

1 Oct, 2016 01:41 IST|Sakshi
ఇండస్ట్రియల్ గ్యాస్ రేటు18% తగ్గింపు

18 నెలల్లో నాల్గవసారి
న్యూఢిల్లీ: విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల తయారీ, సీఎన్‌జీ సరఫరాలకు సంబంధించిన ఇండస్ట్రియల్ గ్యాస్ ధరను కేంద్రం 18 శాతం తగ్గించింది. దీనితో ఈ ధర  మిలియన్ బ్రిటన్ థర్మల్ యూనిట్‌కు 2.5 డాలర్లకు తగ్గింది. ఈ గ్యాస్ రేటు తగ్గించడం 18 నెలల్లో ఇది నాల్గవసారి. దీనితో చమురు, ఖనిజ వాయువుల సంస్థ (ఓఎన్‌జీసీ), రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత క్షేత్రాల్లో ఉత్పత్తి అయిన సహజ వాయువు రేటు అక్టోబర్ 1 నుంచి 6 నెలల పాటు ఎంఎంబీటీయూకు 2.50 డాలర్లుగా కొనసాగనుంది.

ప్రస్తుతం ఈ ధర 3.06 డాలర్లుగా ఉంది.  2014 అక్టోబర్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వం ఆమోదించిన కొత్త గ్యాస్ ధర ఫార్ములా ప్రకారం- ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇండస్ట్రియల్ గ్యాస్ ధర సమీక్ష నిర్ణయం ఉంటుంది.   తదుపరి రేటు నిర్ణయం ఏప్రిల్ 1న జరుగుతుంది.  కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ), గృహ వినియోగ పైప్డ్ సహజ వాయువు ముడి పదార్థాల ధరలు తగ్గడం- ఇండస్ట్రియల్ గ్యాస్ ధర దిగిరావడానికి కారణం. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా ఈ ధర 20 శాతం తగ్గి 3.06 డాలర్లకు చేరింది.

మరిన్ని వార్తలు