బయోకాన్‌కు భారీ షాక్‌

16 Aug, 2017 14:59 IST|Sakshi

ముంబై:  కొనుగోళ్లతో   జోరుగా స్టాక్‌మార్కెట్‌ లో పార్మా కౌంటర్‌ నష్టాల్లో కొనసాగుతోంది. ముఖ్యంగా దేశీ ఫార్మా సంస్థ బయోకాన్‌ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి.  బయోకాన్ కేన్సర్ మందు  ట్రస్టుజుమాబ్‌ పై యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ   ఔషధం ఫైలింగ్‌ను ఉపసంహరించుకుందున్న వార్తలతో  దాదాపు 8శాతం  నష్టపోయి టాప్‌ లూజర్‌గా నమోదవుతోంది.

యూరోపియన్‌ ఔషధ అథారిటీ(ఈఎంఏ) నుంచి ఇటీవల ట్రస్టుజుమాబ్‌కు ప్రమాణాలకు తగిన తయారీ(జీఎంపీ) గుర్తింపును పొందినప్పటికీ కంపెనీ  అప్లికేషన్‌ను వెనక్కి తీసుకునేందుకు నిర్ణయించుకుంది. దీనిపై స్పందించిన బయోకాన్‌ఎండీ కిరణ​ మజుందార్‌ షా బయోకాన్ యూరోపియన్ రెగ్యులేటరి అధికారులు ట్రస్టుజుమాబ్, పెగ్‌ఫిల్‌గ్రాస్టిమ్ ఉత్పత్తులకు ఔషధాలపై పునర్ తనిఖీ కోసం సంస్థకు సమాచారం అందించారని చెప్పారు.  అమెరికా  రెగ్యులేటరీ  యూఎఫ్‌డీఏకు ఈఎంఏకు చాలా తేడా వుందనీ దీన్ని గమనించాలని కోరారు.  ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు