రాష్ట్ర మార్కెట్లోకి బ్లాక్‌బెర్రీ క్యూ5

25 Jul, 2013 03:50 IST|Sakshi
blackberry

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్లాక్‌బెర్రీ మరో అత్యాధునిక స్మార్ట్‌ఫోన్ ‘క్యూ5’ను మార్కెట్లోకి విడుదల చేసింది. బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా పనిచేసే ఈ ఫోన్ ధరను రూ.24,990గా నిర్ణయించారు. 3.1 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో టైపింగ్‌కు అనుగుణంగా క్లాసిక్ కీ బోర్డును అందిస్తున్నామని, ఒకేసారి రెండు కంటే ఎక్కువ అప్లికేషన్స్‌తో పనిచేసే విధంగా క్యూ5ని రూపొందించినట్లు బ్లాక్‌బెర్రీ డెరైక్టర్ (అలయెన్సెస్, బిజినెస్) అన్నే మాథ్యూ తెలిపారు. ఎరుపు, నలుపు, తెలుపు రంగుల్లో ఈ ఫోన్ లభిస్తోంది. బుధవారం రాష్ట్ర మార్కెట్లోకి క్యూ5ని విడుదల చేసిన సందర్భంగా ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ తక్కువ ఖరీదులో యువతను ఆకర్షించే విధంగా దీన్ని తీర్చిదిద్దినట్లు తెలిపారు. 

అందుబాటులో ఉన్న 1,20,000 అప్లికేషన్స్‌ను వినియోగించుకోవడమే కాకుండా సొంతంగా అప్లికేషన్స్ అభివృద్ధి చేసి వాటిని కూడా వినియోగించుకోవచ్చన్నారు.  బ్లాక్‌బెర్రీ  ఆపరేటింగ్ సిస్టమ్ 10పై విడుదల చేసిన మూడవ ఫోన్ ఇది. త్వరలో మరిన్ని ఫోన్లను విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు. బ్లాక్‌బెర్రీకి ఇండోనేసియా తర్వాత ఇండియానే అతిపెద్ద మార్కెట్ అని మాథ్యూ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు