భారత మార్కెట్లోకి బ్లౌపంక్ట్‌ టీవీలు

12 Sep, 2018 08:18 IST|Sakshi

మూడు సిరీస్‌ల్లో ఎనిమిది మోడళ్లు

రూ.12,999–47,999 రేంజ్‌లో ధర

ఫ్లిప్‌కార్ట్‌ ద్వారానే విక్రయాలు

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన కన్సూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ బ్లౌపంక్ట్‌  భారత మార్కెట్లోకి ఎనిమిది టీవీ మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. మూడు సిరీస్‌ల్లో ఈ టీవీలు లభిస్తాయని వీటి ధరలు రూ.12,999 నుంచి రూ.47,999 రేంజ్‌లో ఉంటాయని బ్లౌపంక్ట్‌ టెలివిజన్‌  ఇండియా ఎమ్‌డీ, సీఈఓ కరణ్‌ బేడి తెలిపారు. ఈ టీవీల విక్రయం కోసం ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌ ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని బ్లౌపంక్ట్‌ భారత భాగస్వామి,  ట్రిగుర్‌ ఎలక్ట్రానిక్స్‌కు ఎమ్‌డీగా కూడా వ్యహరిస్తున్న బేడి  పేర్కొన్నారు.  ఫ్లిప్‌కార్ట్‌ ద్వారానే ఈ టీవీల విక్రయం జరుగుతుందని పేర్కొన్నారు.  ఏడాది కాలంలో రూ.500 కోట్ల టర్నోవర్‌ సాధించడం లక్ష్యమని తెలిపారు. కాగా మూడు నుంచి ఐదేళ్ల కాలంలో ట్రిగుర్‌ ఎలక్ట్రానిక్స్‌తో కలిసి రూ.2,158 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని బ్లౌపంక్ట్‌ ఎమ్‌డీ అండ్రెజ్‌ సెబర్ట్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు