ఆక్సీ99.. చేతిలో ఇమిడే ఆక్సీజన్‌ క్యాన్‌

20 Nov, 2018 01:29 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆక్సిజన్‌ అనగానే ఇప్పటి వరకు ఆసుపత్రుల్లో ఉండే పెద్ద సిలిండర్లే తెలుసు. కానీ ‘ఆక్సీ99’ పేరుతో 120 గ్రాముల బరువున్న క్యాన్‌ భారత్‌లో తొలిసారిగా అందుబాటులోకి వచ్చింది. ధర రూ.650. ఇటలీకి చెందిన ఆరోగ్య సంస్థ ఐఎన్‌జీ ఎల్‌అండ్‌ఏ బాషి టెక్నాలజీ సహకారంతో ఢిల్లీ క్రయోజనిక్‌ ప్రొడక్ట్స్‌ దీన్ని రూపొందించింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో దీన్ని బ్లూవాటర్‌ ఆల్కలైన్‌ సొల్యూషన్స్‌ మార్కెట్‌ చేస్తోంది. క్యాన్‌ జీవిత కాలం రెండేళ్లు. 150 ఇన్‌హలేషన్స్‌ (స్ప్రేలు) వరకు పనిచేస్తుంది. ఆస్తమా, శ్వాస సంబంధ, తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఇది వాడితే ఉపశమనంగా ఉంటుందని బ్లూవాటర్‌ సొల్యూషన్స్‌ సీఎండీ కలిశెట్టి నాయుడు సోమవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

ఆక్సీ ఉత్పత్తులకు ఇండియన్‌ ఫార్మకోపియా ధ్రువీకరణ ఉందన్నారు. అల్యూమినియంతో తయారైన తేలికైన సిలిండర్లను 75–1,700 లీటర్ల సామర్థ్యంతో కంపెనీ తయారు చేస్తోందని చెప్పారు. అన్ని పట్టణాల్లో పంపిణీదారులను నియమిస్తామన్నారు. 12 రాష్ట్రాల్లో ప్రతి నెల 1,50,000 యూనిట్లను విక్రయిస్తున్నామని ఢిల్లీ క్రయోజనిక్‌ ప్రొడక్ట్స్‌ జోనల్‌ మేనేజర్‌ శివ్‌ శర్మ    వెల్లడించారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా