బీఎండబ్ల్యూ కొత్త హ్యాచ్‌, కన్వర్టబుల్‌ కార్లు

24 May, 2018 18:56 IST|Sakshi

గుర్గావ్‌ : జర్మనీ లగ్జరీ కారు తయారీదారు బీఎండబ్ల్యూ మినీ హ్యాచ్‌, కన్వర్టబుల్‌లో అప్‌డేటెడ్‌ వెర్షన్లను నేడు భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. కొత్త మినీ 3-డోర్‌ కూపర్‌ ఎస్‌, మినీ 3-డోర్‌ కూపర్‌ డీ, మినీ 5-డోర్‌ కూపర్‌ డీ, కొత్త మినీ కన్వర్టబుల్‌ కూపర్‌ ఎస్‌ వెర్షన్లలో నేటి నుంచి అన్ని మినీ డీలర్‌షిప్‌ల వద్ద 2018 జూన్‌ నుంచి అందుబాటులో ఉండనున్నాయని బీఎండబ్ల్యూ చెప్పింది. 
 

ఎక్స్‌షోరూంలో వీటి ధరలు ఈ విధంగా ఉన్నాయి....
మినీ 3-డోర్‌ కూపర్‌ డీ (డీజిల్‌)   : రూ.29,70,000
మినీ 3-డోర్‌ కూపర్‌ ఎస్‌ (పెట్రోల్‌‌)   : రూ.33,20,000
మినీ 3-డోర్‌ కూపర్‌ డీ (డీజిల్‌)   : రూ.35,00,000
మినీ కన్వర్టబుల్‌ కూపర్‌ ఎస్‌(పెట్రోల్‌) : రూ.37,10,000

భారత్‌లో ప్రీమియం మినీ కారు సెగ్మెంట్‌లో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కొత్త మినీ హ్యాచ్‌, కొత్త మినీ కన్వర్టబుల్‌ లాంచ్‌ చేసినట్టు బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా అధ్యక్షుడు విక్రమ్‌ పా చెప్పారు. ఈ కొత్త కార్లపై కొత్త మినీ లోగో, టెయిల్‌గేట్‌, స్టీరింగ్‌ వీల్‌, సెంట్రల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ డిస్‌ప్లే, రిమోట్‌ కంట్రోల్‌, సర్క్యూట్‌ రింగ్‌ ఎల్‌ఈడీ డేటైమ్‌ రన్నింగ్‌ లైట్స్‌, టర్న్‌ ఇండికేటర్స్‌ ఉన్నాయి. టైయిల్‌ల్యాంప్స్‌ యూనిక్‌ జాక్‌ డిజైన్‌తో రూపొందాయి. 
 

ఇంటీరియర్‌ ఫీచర్లు...
మల్లి ఫంక్షనింగ్‌ స్టీరింగ్‌, 6.50 అంగుళాల కలర్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ డిస్‌ప్లే విత్‌ బ్లూటూత్‌
 ఆప్షనల్‌ 6.5 టచ్‌స్క్రీన్‌ సిస్టమ్‌ విత్‌ మినీ రేడియో విజ్యువల్‌ బూస్ట్‌
మినీ వైర్‌డ్‌ ప్యాకేజ్‌ దీనిలో 8.8 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ విత్‌ టచ్‌ప్యాడ్‌ కంట్రోలర్‌, మినీ ఫైండ్‌ మేట్‌, నేవిగేషన్‌ సిస్టమ్‌ ప్రొఫెషినల్‌, మినీ కనెక్టెడ్‌ ఎక్స్‌ఎల్‌, టెలిఫోనీ విత్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, సెకండ్ యూఎస్‌బీ ఇంటర్‌ఫేస్‌, 20జీబీ ఇంటర్నల్‌ హార్డ్‌డ్రైవ్‌ ఉన్నాయి.
 

ఇంజిన్‌, పనితీరు
3-డోర్‌ కూపర్‌ ఎస్‌, కన్వర్టబుల్‌ వెర్షన్లు 2.0 లీటర్‌, 4 సిలిండర్‌ ట్విన్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగి ఉన్నాయి. 
3-డోర్‌ కూపర్‌ ఎస్ టాప్‌ స్పీడు 235 కేఎంపీహెచ్‌, కేవలం 6.7 సెకన్లలో 0 నుంచి 100 కేఎంపీహెచ్‌ చేరుకోనుంది
3-డోర్‌ కూపర్‌ డీ, 5-డోర్‌ కూపర్‌ డీ వెర్షన్లు 1.5 లీటర్‌ 3 సిలిండర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి. పెట్రోల్‌ మాదిరిగా కాకుండా ఇది 6 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్సమిషన్‌తో రూపొందింది. 
3, 5 డోర్‌ కూపర్‌ డీ టాప్‌ స్పీడ్‌ 205 కేఎంపీహెచ్‌, ఇది 9.2 సెకన్లలో 0 నుంచి 100 కేఎంపీహెచ్‌ను అందుకోగలదు.
మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని పొందడానికి, మినీ ఆటో స్టార్ట్‌/స్టాప్‌ ఫంక్షన్‌ను కలిగి ఉంది. 
ఈ వాహనాల్లో డ్యూయల్‌ ఫ్రంట్‌ ఎయిర్‌బ్యాగ్స్‌, ఏబీఎస్‌ విత్‌ బ్రేక్‌ అసిస్ట్‌, డైనమిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, కార్నింగ్‌ బ్రేక్‌ కంట్రోల్‌, రన్‌ ఫ్లాట్‌ టైర్లు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు