వడ్డీరేటు పెంచేసిన మరో ప్రభుత్వ బ్యాంకు

5 Jun, 2018 18:42 IST|Sakshi

సాక్షి, ముంబై:  ప్రభుత్వ రంగ  బ్యాంకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లెండింగ్‌ వడ్డీరేట్లను పెంచేసింది.  ఒక సంవత్సరం బెంచ్‌మార్క్ రుణాలపై 5 బేసిస్ పాయింట్లు పెంచింది. 8.40 శాతంనుంచి 8.45 శాతానికి ఎంసీఎల్‌ఆర్‌ను పెంచింది. ఈ సవరించిన వడ్డీరేట్లు జూన్ 7 నుంచి  అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఒకరోజు, ఒక నెల, మూడు నెలలు ,  ఆరు నెలల కాల పరిమితి రుణాలపై వడ్డీరేటు రుసగా 7.95 శాతం, 8 శాతం, 8.1 శాతం, 8.3 శాతం ఉండనుంది.  ఆర్‌బీఐ  ద్వైమాసిక  పాలసీ సమీక్షలో కీలక వడ్డీరేట్లను పెంచనుందన్న అంచనాల నేపథ్యంలో బీఓబీ కూడా ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల, ఎస్‌బీఐ,  పీఎన్‌బీ, యూనియన్ బ్యాంక్‌, ఐసీఐసీఐ,  హెచ్‌డీఎప్‌సీ సహా కొన్ని బ్యాంకులు తమ ఎంసిఎల్ఆర్‌ను పెంచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎంసీఎల్‌ఆర్‌తో ముడిపడివున్న గృహ, వాహన రుణాలు ఇకపై మరింత భారం కానున్నాయి.  

మరిన్ని వార్తలు