భారత్‌లో బోయింగ్ హెలికాప్టర్ల అసెంబ్లింగ్

17 Oct, 2015 01:53 IST|Sakshi

న్యూఢిల్లీ: అమెరికా విమానయాన దిగ్గజ కంపెనీ బోయింగ్ భారత్‌లో చినూక్ లేదా అపాచీ హెలికాప్టర్లను అసెంబుల్ చేయాలని యోచిస్తోంది. అంతేకాకుండా ఫైటర్ జెట్ విమానాల తయారీ సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తోంది. భారత మార్కెట్ తమకు అత్యంత ముఖ్యమైనదని బోయింగ్ చైర్మన్ జిమ్ మ్యాక్‌నెర్నీ చెప్పారు. భారత్ ఇటీవలనే 15 చినూక్, 22 అపాచీ హెలికాప్టర్ల కోసం బోయింగ్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. చినూక్ సంబంధించిన పలు విడిభాగాలను ఇక్కడే తయారు చేస్తున్నామని, అపాచీ హెలికాప్టర్ల తయారీకి సంబంధించి వివిధ భారత కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు