పెట్టుబడులు పెంచేలా బడ్జెట్ ఉండాలి: డీహెచ్‌ఎఫ్‌ఎల్

28 Feb, 2015 03:03 IST|Sakshi

హైదరాబాద్: విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా భారత్‌ను కేంద్రం తీర్చిదిద్దుతోందని డీహెచ్‌ఎఫ్‌ఎల్ సీఎండీ కపిల్ వాధ్వాన్ పేర్కొన్నారు. ఈ దిశగానే అరుణ్ జైట్లీ నేడు సమర్పించే బడ్జెట్ ఉంటుందని ఆశిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బడ్జెట్‌లో పన్నులకు సంబంధించిన అస్పష్టతలను తొలగించాలని పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు మరిన్ని పెట్టుబడులు పెట్టేలా చర్యలుండాలని వివరించారు. మౌలిక, విద్య, ఆరోగ్య, గృహ నిర్మాణ రంగాల్లో విదే శీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగాల్సిన అవసరముందని తెలిపారు. ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని చూరగొనేలా, పెట్టుబడుల జోరును పెంచేలా బడ్జెట్ ఉండాలని సూచించారు.

>
మరిన్ని వార్తలు