బీపీసీఎల్‌ నష్టం రూ.1,361 కోట్లు

5 Jun, 2020 06:51 IST|Sakshi

8% తగ్గి రూ.68,991 కోట్లకు ఆదాయం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ భారత్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌)కు గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో భారీగా నష్టాలు వచ్చాయి. రిఫైనింగ్‌ మార్జిన్లు బలహీనంగా ఉండటం, ఇన్వెంటరీ నష్టాలు భారీగా ఉండటం, లాక్‌డౌన్‌ కారణంగా అమ్మకాలు తగ్గడం...ఈ కారణాల వల్ల గత క్యూ4లో ఈ కంపెనీకి రూ.1,361 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఈ కంపెనీ రూ.1,261 కోట్ల నికర లాభం సాధించింది. కాగా, ఆదాయం 8 శాతం తగ్గి రూ.68,991 కోట్లకు చేరిందని బీపీసీఎల్‌ వెల్లడించింది.   

n అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.2,703 కోట్ల నిర్వహణ లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.619 కోట్ల నిర్వహణ నష్టాలు వచ్చాయి.  
n గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్‌లో రూ.1,081 కోట్ల ఇన్వెంటరీ నష్టాలు వచ్చాయి.  
n చమురు ఉత్పత్తి సీక్వెన్షియల్‌గా 0.23 శాతం తగ్గి 8.39 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు చేరింది.    

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బీపీసీఎల్‌ షేర్‌ 2 శాతం లాభంతో రూ.357 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు