బీపీఎల్ నుంచి హోమ్ ఆటోమేషన్, సర్విలెన్స్ ఉత్పత్తులు

7 May, 2016 01:10 IST|Sakshi
బీపీఎల్ నుంచి హోమ్ ఆటోమేషన్, సర్విలెన్స్ ఉత్పత్తులు

న్యూఢిల్లీ: దేశీ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బీపీఎల్ తాజాగా హోమ్ సర్విలెన్స్, ఆటోమేషన్ విభాగంలో పలు రకాల ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేసింది. సంస్థ ‘బీపీఎల్ ఐక్యూ’ బ్రాండ్ కింద స్మార్ట్ ఆటోమేషన్, స్మార్ట్ సర్విలెన్స్ అనే ఉత్పత్తులను తీసుకువచ్చింది. బీపీఎల్ ఐక్యూ స్మార్ట్ ఆటోమేషన్ ఒక అడ్వాన్స్‌డ్ వైర్‌లెస్ టెక్నాలజీ అని, దీని ద్వారా సెక్యూరిటీ, ఉష్ణోగ్రత, లైటింగ్, ఆడియో వంటి ఇతర హోమ్ కంట్రోల్ ఫంక్షన్లను ఒక టచ్‌తో నియంత్రించవచ్చని సంస్థ తెలిపింది.

దీని ధర రూ.50,000 నుంచి ఉంటుందని పేర్కొంది. ఇక బీపీఎల్ ఐక్యూ స్మార్ట్ సర్విలెన్స్‌లోని పలు రకాల భద్రతా కెమెరాలు యూజర్ ఫ్రెండ్లీగా, టెక్నాలజీ పరంగా అడ్వాన్స్‌డ్ ఫీచర్లను కలిగి ఉంటాయని తెలిపింది. వీటి ధర రూ.1,000 నుంచి ఉంటుందని పేర్కొంది. ‘ఆటోమేషన్ మార్కెట్ పరిమాణం రూ.600 కోట్లు ఉండొచ్చని, ఇందులో వచ్చే మూడేళ్లలో 20% వాటాను లక్ష్యంగా నిర్దేశించుకున్నాం’ అని బీపీఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.విజయ కుమార్ తెలిపారు.

>
మరిన్ని వార్తలు