యస్‌ బ్యాంక్‌ చైర్మన్‌గా బ్రహ్మ్‌దత్‌!

19 Dec, 2018 00:47 IST|Sakshi

న్యూఢిల్లీ: యస్‌ బ్యాంక్‌ చైర్మన్‌గా డైరెక్టర్లలో ఒకరైన బ్రహ్మ్‌ దత్‌ పేరును రిజర్వు బ్యాంకుకు యస్‌బ్యాంక్‌ సిఫారసు చేసినట్లు తెలియవచ్చింది. గత నెలలో చైర్మన్‌ పదవికి అశోక్‌ చావ్లా రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీ అయింది. యస్‌ బ్యాంక్‌ ఈ పదవికి బ్రహ్మ్‌దత్‌ను ఎంపిక చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దత్‌ ఇప్పటికే డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని, ఆయనకు బ్యాంక్‌కు సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన ఉందని, అందుకే చైర్మన్‌ పదవికి ఆయనను బ్యాంక్‌ ఎంపిక చేసిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ఉద్యోగిగా రిటైరైన దత్‌ ప్రస్తుతం యస్‌ బ్యాంక్‌లో ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం సీఈఓగా, ఎమ్‌డీగా ఉన్న రాణా కపూర్‌ పదవీ కాలాన్ని వచ్చే నెల 31 తర్వాత పొడిగించడానికి ఆర్‌బీఐ అంగీకరించలేదు. వచ్చే నెల 9న జరిగే బోర్డ్‌ సమావేశంలో రాణా కపూర్‌ వారసుడిని ఎంపిక చేస్తామని యస్‌ బ్యాంక్‌ వెల్లడించింది .ఫోర్టిస్‌లో 2 శాతం వాటా విక్రయం ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌లో 2 శాతం వాటాను విక్రయించామని యస్‌ బ్యాంక్‌ తెలిపింది. 2.13 శాతం వాటాకు సమానమైన 1,23,37,323 షేర్లను దశల వారీగా విక్రయించినట్లు వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్‌ 21 నాటికి ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌లో యస్‌ బ్యాంక్‌కు 9.33 శాతం వాటా ఉంది. 

మరిన్ని వార్తలు