ఆరు రోజుల లాభాలకు బ్రేక్‌ 

23 Oct, 2019 02:42 IST|Sakshi

ఇన్ఫోసిస్‌ ఎఫెక్ట్‌  

ఇటీవల పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ  

335 పాయింట్లు పతనమై 38,964కు సెన్సెక్స్‌  

74 పాయింట్ల నష్టంతో 11,588కు నిఫ్టీ

ఆరు రోజుల స్టాక్‌మార్కెట్‌ లాభాలకు మంగళవారం బ్రేక్‌ పడింది. ఈ ఆరు రోజుల్లో లాభపడిన కొన్ని షేర్లలో లాభాల స్వీకరణ జరగడం, ప్రజావేగు ఫిర్యాదు నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ భారీగా నష్టపోవడం ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 39,000 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,600 పాయింట్ల దిగువకు పడిపోయాయి. మహారాష్ట్ర, హర్యానా ఎగ్జిట్‌ పోల్స్‌ పాలక బీజేపీకే అనుకూలంగా ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 20 పైసలు పుంజుకోవడం వంటి సానుకూలాంశాలు  ప్రభావం చూపించలేకపోయాయి.  దిగువ స్థాయిల్లో ప్రైవేట్‌ బ్యాంక్‌ షేర్ల మద్దతు లభించడంతో నష్టాలు పరిమితమయ్యాయి. సెన్సెక్స్‌ 335 పాయింట్లు పతనమై 38,964 పాయింట్ల వద్ద, నిఫ్టీ 74 పాయింట్ల నష్టపోయి 11,588 పాయింట్ల వద్ద ముగిశాయి.  సెన్సెక్స్‌ నష్టాల్లో ఆరంభమైంది.

501 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌... 
నష్టాల తర్వాత లాభాల్లోకి వచి్చనప్పటికీ, మళ్లీ నష్టాల్లోకి జారిపోయింది. ఒక దశలో  128 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ మరో దశలో 373 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 501 పాయింట్ల రేంజ్‌లో పతనమైంది. ఇంట్రాడేలో 11,700 పాయింట్లపైకి నిఫ్టీ ఎగబాకినప్పటికీ, అమ్మకాల ఒత్తిడి కారణంగా ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. ఇక ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, యూరప్‌ మార్కెట్లు మిశ్రమంగా మొదలయ్యాయి.  
- లాభాలు పెంచుకోవడానికి అకౌంట్‌ అవకతవకలకు, అనైతిక విధానాలకు ఇన్ఫోసిస్‌ సీఈఓ సలిల్‌ పరేఖ్‌ పాల్పడ్డారన్న ప్రజావేగు ఫిర్యాదుల నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ షేర్‌ భారీగా పతనమైంది. 
సెపె్టంబర్‌ క్వార్టర్లో ప్రమోటర్లు తమ వాటాను తగ్గించుకున్నారన్న వార్తల కారణంగా డిష్‌ టీవీ షేర్‌ 12 శాతం పెరిగి రూ. ముగిసింది.  
క్యూ2 ఫలితాలు బాగా ఉండటంతో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర 13 శాతం, శ్రీ సిమెంట్‌ 5 శాతం, గ్రాన్యూల్స్‌ ఇండియా 18 శాతం చొప్పున లాభపడ్డాయి.  

మరిన్ని వార్తలు