బ్రీఫ్స్..

14 Sep, 2015 00:42 IST|Sakshi

హెచ్‌డీఎఫ్‌సీ క్లిక్ 2 రిటైర్

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘క్లిక్ 2 రిటైర్’ పేరుతో యూనిట్ లింక్డ్ ఆన్‌లైన్ రిటైర్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్‌లో మాత్రమే  లభించే ఈ పథకానికి ప్రీమియం ఒకేసారిగా లేదా కాలపరిమితి పూర్తయ్యే వరకు చెల్లించవచ్చు. 18 ఏళ్లు నిండిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. అతి తక్కువ వ్యయాలతో రూపొందించిన ఈ పథకంలో 100 శాతం ప్రీమియంను ఇన్వెస్ట్ చేస్తామని కంపెనీ పేర్కొంది. చెల్లించిన ప్రీమియంపై 101 శాతం నుంచి 135 శాతం లేదా ఫండ్ వేల్యూ ఈ రెండింటిలో ఏది ఎక్కువ అయితే అది బీమా రక్షణగా ఇవ్వడం జరుగుతుంది. ప్రీమియం అలకేషన్, పాలసీ  అడ్మినిస్ట్రేషన్, డిస్‌కంటిన్యూ చార్జీలు ఏమీ లేకపోవడం ఈ పాలసీలోని ప్రధాన ఆకర్షణలు.
 
ఐడీబీఐ డివిడెండ్

ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఈక్విటీ అడ్వాంటేజ్ పథకంపై 14 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్‌కు రికార్డు తేదీని సెప్టెంబర్ 15గా నిర్ణయించారు. మంగళవారంలోగా యూనిట్లు కలిగిన ప్రతీ యూనిట్‌పై రూ. 1.40 డివిడెండ్‌గా లభిస్తుంది. ప్రస్తుతం యూనిట్ విలువ రూ. 19.33గా ఉంది.
 

ఐసీఐసీఐ బిజినెస్ సైకిల్ ఫండ్

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సంస్థ బిజినెస్ సైకిల్ ఫండ్‌లో మొదటి సిరీస్‌ను విడుదల చేస్తోంది. సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే ఈ క్లోజ్‌డ్ ఎండెడ్ ఈక్విటీ న్యూ ఫండ్ ఆఫర్ సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత 1,281 రోజులు వరకు వైదొలగడానికి వీలులేదు.  కనీస ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం రూ. 5,000.
 
ఎల్‌ఐసీ ఫిక్స్‌డ్ టర్మ్

ఎల్‌ఐసీ నొమూరా మ్యూచులవ్ ఫండ్ సంస్థ డ్యూయల్ అడ్వాంటేజ్ ఫిక్స్‌డ్ టర్మ్ ప్లాన్‌లో సిరీస్2ను విడుదల చేసింది. ఈ పథకం కాలపరిమితి 43 నెలలు. ఈ పథకం ద్వారా సేకరించిన మొత్తంలో గరిష్టంగా 35 శాతం ఈక్విటీల్లో మిగిలిన మొత్తం డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. సెప్టెంబర్ 10న ప్రారంభమైన ఎన్‌ఎఫ్‌వో సెప్టెంబర్ 24తో ముగుస్తుంది. కనీస ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ. 5,000.

మరిన్ని వార్తలు