బ్రిటానియాకు ‘బిస్కెట్ల’ దన్ను

18 Jul, 2020 05:40 IST|Sakshi

లాక్‌డౌన్‌లో పెరిగిన డిమాండ్‌ 

రెండింతలైన నికర లాభం 

రూ.543 కోట్లకు వృద్ధి

న్యూఢిల్లీ: బ్రిటానియా ఇండస్ట్రీస్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2020–21) జూన్‌ క్వార్టర్‌లో రెట్టింపునకు మించి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2019–20) క్యూ1లో రూ.249 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.543 కోట్లకు పెరిగింది. లాక్‌డౌన్‌ సమయంలో బిస్కెట్లకు డిమాండ్‌ పెరగడం, వలస కార్మికులు పట్టణాల నుంచి పల్లెలకు చేరడం కూడా ఈ కంపెనీ అమ్మకాలకు కలసివచ్చిందని నిపుణులంటున్నారు. మొత్తం ఆదాయం రూ.2,768 కోట్ల నుంచి 27 శాతం వృద్ధితో రూ.3,514 కోట్లకు పెరిగిందని కంపెనీ పేర్కొంది. అన్ని అంశాల్లోనూ ఈ కంపెనీ ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మించాయి.
 ► నిర్వహణ లాభం రూ.395 కోట్ల నుంచి రూ.717 కోట్లకు ఎగసింది.  
 ► నిర్వహణ లాభ మార్జిన్‌ 6.4 శాతం పెరిగి 21 శాతానికి చేరింది.  

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బ్రిటానియా ఇండస్ట్రీస్‌ షేర్‌ 2 శాతం నష్టంతో రూ.3,784 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయి, రూ.3,949ను తాకింది.

మరిన్ని వార్తలు