బ్రిటానియాకు పతంజలి దెబ్బ

23 May, 2016 13:20 IST|Sakshi
బ్రిటానియాకు పతంజలి దెబ్బ

ముంబై : అతిపెద్ద ఆహార ఉత్పత్తుల కంపెనీ బ్రిటానియా ఇండస్ట్రీస్  స్వల్ప లాభాలాను నమోదు  చేసినప్పటికీ, మార్కెట్లో  ఈ కంపెనీ షేరు కుదేలయ్యింది. ముఖ్యంగా పతంజలి నుంచి ఎదుర్కొంటున్న పోటీ తమ   వ్యాపారం పై ప్రభావం చూపిందని కంపెనీ చెబుతోంది.  అటు  విశ్లేషకుల అంచనాలకుగుణంగా సంస్థ లాభాలు పెరగడకపోవడంతో  మార్కెట్లో  బ్రిటానియా 8 శాతం మేర నష్టపోయింది. 

ఈ ఏడాది  మార్చి త్రైమాసిక ఫలితాల్లో అంచనాలకు తక్కువగా  ఆదాయాన్ని  నమోదుచేయడం ఇన్వెస్టర్లను నిరాశపర్చింది.  బెంగళూరుకు చెందిన బ్రిటానియా ఇండస్ట్రీస్ నికర లాభాలు 14శాతం పెరిగి రూ.190 కోట్లగా చూపించాయి. 8శాతం మేరే అమ్మకాలు పెరిగి రూ.2,190 కోట్లగా నమోదయ్యాయి. 46శాతం పన్ను చెల్లింపులు పెరగడంతో పాటు, 14శాతం కంపెనీకి వచ్చే  ఇతరత్రా ఆదాయాలు పడిపోయాయి. దీంతో బ్రిటానియా నికర లాభాలు కొంతమేర చేజారి, మార్కెట్ విశ్లేషకుల అంచనాలు తలకిందులు కావడంతో  అమ్మకాల ఒత్తిడి నెలకొంది.

ఎక్సైజ్ డ్యూటీ ప్రోత్సహకాలను దశల వారీగా ప్రభుత్వం తొలగించడంతో, ఈ త్రైమాసికంలో రాబడులపై 100 పాయింట్ల  ప్రభావం చూపాయని బ్రిటానియా తెలిపింది. అదేవిధంగా పతంజలి నుంచి ఎదుర్కొంటున్న గట్టి పోటీ, కంపెనీ మార్కెట్ షేరుపై ప్రభావం చూపిందని క్రిస్ట్ వెల్త్ మేనేజ్ మెంట్ సీఈవో లాన్సేలట్ డి కన్హా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోవడం బ్రిటానియా లాభాలపై ప్రభావం చూపాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. బ్రిటానియా లాభాలు మార్కెట్ అంచనాలను తాకలేకపోవడంతో, మార్కెట్లో ఈ షేర్లు 8శాతం మేర నష్టపోయాయి.

మరిన్ని వార్తలు