బ్రిటిష్ ఎయిర్‌వేస్ 15 శాతం డిస్కౌంట్ ఆఫర్

13 Aug, 2015 01:09 IST|Sakshi

 న్యూఢిల్లీ : బ్రిటిష్ ఎయిర్‌వేస్ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. భారత్ నుంచి యూకే, మరికొన్ని యూరోపియన్ దేశాలకు విమానయానం చేసే ప్రయాణికులకు టికెట్ ధరల్లో 15 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఆగస్ట్ 16 వరకు టికెట్లను బుకింగ్ చేసుకున్న వారు సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని తెలిపింది.

 ఎమిరేట్స్ డిస్కౌంట్ ఆఫర్: కాగా ఎమిరేట్స్ కూడా భారత్ నుంచి గల్ఫ్ ప్రాంతాలకు ప్రయాణికుల కోసం ఆగస్టు 17 వరకూ టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద టికెట్లను బుకింగ్ చేసుకున్న వారు సెప్టెంబర్ 10 నుంచి డిసెంబర్ 10 మధ్యకాలంలో ఎప్పుడైన ప్రయాణించవ చ్చు.

మరిన్ని వార్తలు