క్యూ4 ఫలితాల తర్వాత ఎస్‌బీఐ టార్గెట్‌ ధర తగ్గింపు

8 Jun, 2020 13:23 IST|Sakshi

నికర వడ్డీ మార్జిన్లపై ఒత్తిళ్లు 

అంతంగా మాత్రంగానే రుణవృద్ధి 

‘‘బై’’ రేటింగ్‌ మాత్రం కొనసాగింపు

ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ గతవారంలో శుక్రవారం త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఫలితాలు అంచనాలకు మించి నమోదయ్యాయి. రుణ వృద్ధి స్తబ్దుగా ఉండటం, నికర వడ్డీ మార్జిన్లు ఇప్పటికీ ఒత్తిళ్లను ఎదుర్కోంటున్న నేపథ్యంలో పలు బ్రోకరేజ్‌ సంస్థలు ఎస్‌బీఐ షేరు టార్గెట్‌ ధరను తగ్గించాయి. 

అయితే తక్కువ వాల్యూయేషన్లు, మంచి అసెట్‌ నాణ్యతను కలిగి ఉండటంతో చాలా బ్రోకరేజ్‌ సంస్థలు ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించాయి. యస్‌ బ్యాంక్‌ సంక్షోభం తర్వాత ఎస్‌బీఐ డిపాజిట్లు భారీగా పెరగడం కలిసొచ్చే అంశంగా ఉందని బ్రోకరేజ్‌ సంస్థలు చెప్పుకొచ్చాయి. 

డిపాజిట్లు, అండర్‌రైట్‌, డిజిటలైజేషన్ అంశాల కారణంగా ఎస్‌బీఐ అత్యుత్తమ ప్రమాణాలను కనబరుస్తోంది. అనుబంధ సంస్థల వాల్యూయేషన్లను అన్‌లాక్‌ చేయగల భారీ సామర్థ్యం, బ్యాంక్‌ నిర్వహణ లాభం 1.7-2.0 శాతంగా నమోదు కావడం తదితర సానుకూలాంశాలతో ఎస్‌బీఐ ఒత్తిళ్లను తట్టుకోగలుగుతుంది. 

‘‘మార్చి తర్వాత ఎంసీఎల్‌ఆర్‌ 50బేసిస్‌ పాయింట్లు తగ్గడంతో నికర వడ్డీ మార్జిన్లకు మరింత ప్రమాదం పొంచి ఉంది. ఆకర్షణీయమైన వాల్యూయేషన్‌, బలమైన ఫ్రాంచైజీలు ఉన్నప్పటికీ.., ఆర్థిక / సామాజిక బాధ్యతల భారాన్ని భరించడంలో ముందంజలో ఉండటం ఎస్‌బీఐ మరింత ఒత్తిడిని పెంచుతుంది.’’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ బ్రోకరేజ్‌ చెప్పుకొచ్చింది. 

మారిటోరియం పరిగణనలోకి తీసుకుంటే ఇతర రుణదాతలతో పోల్చితే ఎస్‌బీఐ తక్కువ కేటాయింపులు జరపడం నిరాశపరిచిందని ఎంకే గ్లోబల్‌ సంస్థ తెలిపింది.

మరిన్ని వార్తలు