టీసీఎస్‌‌ క్యూ1 ఫలితాలపై బ్రోకరేజ్‌ల వైఖరి ఏమిటి..?

10 Jul, 2020 16:49 IST|Sakshi

అంతంత మాత్రంగా నమోదైన త్రైమాసిక ఫలితాలు

దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టీసీఎస్‌ గురువారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. క్యూ1 ఫలితాలు మార్కెట్‌ వర్గాలను నిరుత్సాహపరచడంతో శుక్రవారం మార్కెట్‌ ముగిసే సరికి టీసీఎస్‌ షేరు 0.75శాతం లాభంతో రూ.2221.65 వద్ద స్థిరపడింది. కంపెనీ ఆర్థిక ఫలితాలను పరిశీలిస్తే కోవిడ్‌-19 ప్రభావంతో వ్యాపారంలో తీవ్ర అంతరాయాన్ని చవిచూసినట్లు తెలుస్తోంది. అధిక వ్యాల్యూయేషన్‌ ఉత్పన్నం కావడం అనేక బ్రోకరేజ్‌ సం‍స్థలకు అందోళ కలిగించే అంశంగా మారింది. ఈ నేపథ్యంలో బ్రోకరేజ్‌ సంస్థలు క్యూ1 ఫలితాలపై మిశ్రమ వైఖరిని వెల్లడించాయి.  

  • ‘‘సీక్వెన్షియల్‌ ప్రాతిపదికన కంపెనీ ఆదాయం 5.2శాతం క్షీణిస్తుందని మార్కెట్‌ వర్గాలు అంచనావేశాయి. అయితే అన్యూహంగా ఈ క్యూ1లో ఆదాయం 6.9శాతంగా క్షీణతను చవిచూడటం గమనార్హం.’’ అని ఎ‍మ్‌కే బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. 
  • మంచి వ్యాల్యూయేషన్లు ఇటీవల షేరులో అప్‌మూవ్‌ను కలిగించాయి. ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో షేరు రానున్న రోజుల్లో షేరు పరిమితి శ్రేణిలో కదలాడే అవకాశం ఉందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. 
  • ఇన్వెస్టెక్‌ బ్రోకరేజ్‌ సంస్థ గతంలో టీసీఎస్‌ కంపెనీ షేరుకు హోల్డ్‌ రేటింగ్‌ను కేటాయించింది. ఆర్థిక ఫలితాల ప్రకటన తర్వాత ‘‘సెల్‌’’ రేటింగ్‌కు కుదించింది. 
  • మాక్వేరీ బ్రోకరేజ్‌ సంస్థ ‘‘అవుట్‌ఫెర్‌ఫామ్‌’’ రేటింగ్‌ నుంచి ‘‘న్యూటల్‌’’ రేటిం‍గ్‌కు తగ్గించింది.
  • సీఎల్‌ఎస్‌ఈ అవుట్‌ఫెర్‌ఫామ్‌ రేటింగ్‌ను కేటాయించింది. 
  • ఎడెల్వీజ్‌ ‘‘బై’’ రేటింగ్‌ కొనసాగించింది. 
  • మోర్గాన్‌ స్టాన్లీ ఈక్విల్‌ వెయిట్‌ రేటింగ్‌ కొనసాగించింది.
  • మోతీలాల్‌ ఓస్వాల్‌, నోమురాలు ‘‘న్యూట్రల్‌’’ రేటింగ్‌ను కొనసాగించగా, కోటక్‌ ఈక్విటీస్‌ బ్రోకరేజ్‌ ‘‘తగ్గింపు’’ రేటింగ్‌ను కొనసాగించింది.  

(టీసీఎస్‌ షేరుపై వివిధ బ్రోకరేజ్‌ సంస్థల రేటింగ్‌, టార్గెట్‌ ధరల మార్పులు చేర్పులు కింది టేబుల్‌లో చూడవచ్చు)

>
మరిన్ని వార్తలు