బీఎస్ఈ నుంచి ‘సింగిల్ మెసేజ్ విండో’ సేవలు

31 Aug, 2016 01:19 IST|Sakshi
బీఎస్ఈ నుంచి ‘సింగిల్ మెసేజ్ విండో’ సేవలు

న్యూఢిల్లీ: ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్‌ఈ తాజాగా ఈక్విటీ, కరెన్సీ డెరివేటివ్స్ విభాగాల్లో ఒకే ఒక మెసేజ్‌తో పలు కోట్స్ చేయడానికి వీలుగా ‘సింగిల్ మెసేజ్ విండో’ సేవలను ప్రారంభించింది. దీని ద్వారా ట్రేడింగ్ చేసే వ్యక్తి 99 కోట్స్ చేయవచ్చని బీఎస్‌ఈ తెలిపింది. ఒకే ప్రొడక్ట్‌కు చెందిన పలు కాంట్రాక్టులకు మల్టిపుల్ కోట్స్ ఇవ్వొచ్చని పేర్కొంది. ఈ కోట్ అనేది ఒక సైడ్ (కొనడం లేదా అమ్మడం) కావొచ్చు లేదా డబుల్ సైడ్ (కొనడం, అమ్మడం)కు సంబంధించినది కావొచ్చని తెలిపింది. రిక్వెస్ట్ ద్వారా కోట్స్‌ను సవరించుకోవచ్చని పేర్కొంది. ఒకవేళ ట్రేడర్ రిస్క్ రిడక్షన్ మోడ్‌లోకి వెళితే పెండింగ్‌లో ఉన్న అన్ని కోట్స్ డిలీట్ అవుతాయని తెలిపింది.

మరిన్ని వార్తలు