బీఎస్‌ఎన్‌ఎల్ స్పెషల్ ఈద్ ప్రీపెయిడ్ ప్లాన్‌

25 May, 2020 10:26 IST|Sakshi

ఈద్ స్పెషల్ ప్రీపెయిడ్ ప్లాన్ : రూ. 786  వాలిడిటీ 90 రోజులు

రూ .699 ప్లాన్‌ వాలిడిటీ 160 రోజులు

సాక్షి. ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ  భారత్ సంచార్ నిగం లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్)  తన వినియోగదారుల కోసం స్పెషల్ ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. ముఖ్యంగా  రూ.786  ప్లాన్ ను ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ప్రత్యేకంగా తీసుకొచ్చింది.

ఈద్ సందర్భంగా ముస్లింలు పవిత్ర సంఖ్యగా భావించే  786  నంబరుతో ఈ ప్లాన్ తీసుకు రావడం విశేషం.  ఈ ప్లాన్ వాలిడిటీ 90 రోజులు మాత్రమే. సంస్థ ఆవిష్కరించిన మరో ప్లాన్ ధర 699 రూపాయలు. వీటితో పాటు కంపెనీ  ఇప్పటికే ఎస్‌టివి 118, కాంబో 18 ప్రీపెయిడ్ ప్లాన్‌లనుతీసుకొచ్చింది ఈ ప్లాన్లు అన్ని సర్కిల్‌లలో అందుబాటులో ఉన్నాయి.  లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుండి, బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకోసం  ఇటీవల చాలా ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

రూ .786 ఈద్  స్పెషల్  ప్లాన్ : రూ. 786 టాక్‌టైమ్‌, మొత్తం 30జీబీ  హై స్పీడ్ డేటా లభ్యం. ఈ ప్లాన్‌ 90 రోజుల చెల్లుబాటులోవుంటుంది.  2020 జూన్ 21 వరకు  రీఛార్జ్ చేసుకోవచ్చు.
రూ .699 ప్రీపెయిడ్ ప్లాన్:  ఈద్ స్పెషల్ ప్లాన్‌తో పాటు, బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా విడుదల చేసింది.  మొత్తం 500 ఎమ్‌బి డేటాతో పాటు ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాలింగ్ సదుపాయం, రోజుకు 100ఎస్ఎంఎస్ లు లభ్యం. ఇది 160 రోజుల చెల్లుబాటులో వుంటుంది. అలాగే స్పెషల్ పెర్సనలైజ్డ్ రింగ్‌బ్యాక్ టోన్‌ కూడా వుంది.
బీఎస్ఎన్ఎల్ కాంబో 18 డేటా ప్లాన్: కాంబో 18 ప్రీపెయిడ్ ప్లాన్ : రెండు రోజులుతో స్వల్పకాలిక ప్రణాళిక. ఈ ప్రణాళిక పుదుచ్చేరి, లక్ష్వదీప్ సహా 22 సర్కిళ్లలో లభిస్తుంది.  30 జీబీ హైస్పీడ్ డేటాను అందిస్తుంది. డేటా  లిమిట్ అయిపోయిన తర్వాత వేగం 80 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. ఇతర నెట్‌వర్క్‌లకు 250 నిమిషాల వరకు ఉచిత కాలింగ్ సదుపాయం.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు