అసెట్స్‌ విక్రయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌

2 Jan, 2020 08:07 IST|Sakshi

రూ. 300 కోట్ల సమీకరణపై కసరత్తు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అసెట్స్‌ విక్రయం ద్వారా దాదాపు రూ. 300 కోట్లు సమీకరించడంపై ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నిర్దిష్ట భూములను విక్రయించేందుకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) తదితర సంస్థలతో చర్చలు జరుపుతోందని టెలికం శాఖ (డాట్‌) సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌తో పాటు ప్రభుత్వ రంగానికి చెందిన మరో టెల్కో ఎంటీఎన్‌ఎల్‌ ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. దీనితో బీఎస్‌ఎన్‌ఎల్‌ జీతాల బిల్లు 50శాతం, ఎంటీఎన్‌ఎల్‌ బిల్లు 75 శాతం మేర తగ్గుతుందని అధికారి వివరించారు. బాండ్ల ద్వారా సుమారు రూ. 15,000 కోట్లు సమీకరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పూచీకత్తునివ్వనుందని పేర్కొన్నారు. దీనికి ఆర్థిక శాఖ అనుమతులు వస్తే జనవరి లేదా ఫిబ్రవరిలో సమీకరణ జరిపే అవకాశం ఉందని అధికారి చెప్పారు. ఈ నిధులను రుణాల చెల్లింపు, పెట్టుబడుల కోసం వినియోగించనున్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు