బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇంటర్నెట్‌ టెలిఫోనీ

12 Jul, 2018 00:34 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ దేశీయంగా తొలి ఇంటర్నెట్‌ టెలిఫోనీ సర్వీసును ఆవిష్కరించింది. మొబైల్‌ యాప్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఏ టెలిఫోన్‌ నంబరుకైనా కాల్‌ చేసే సదుపాయం దీనితో అందుబాటులోకి రానుంది. జూలై 25 నుంచి ఈ సర్వీసులు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన మొబైల్‌ యాప్‌ ’వింగ్స్‌’ను కేంద్ర టెలికం శాఖ మంత్రి మనోజ్‌ సిన్హా బుధవారం ఆవిష్కరించారు. ‘ప్రస్తుతం పోటీ తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌ మార్కెట్‌ వాటాను పెంచుకోగలగడం ప్రశంసనీయం. సిమ్‌ అవసరం లేకుండా ఫోన్‌ కాల్స్‌ చేసుకునే సదుపాయం కల్పించే ఇంటర్నెట్‌ టెలిఫోనీని అందుబాటులోకి తెచ్చినందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ను అభినందిస్తున్నా‘ అని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. దేశీ సేవల కోసం వార్షికంగా రూ. 1,099 ఫీజును చెల్లించి, వై–ఫై లేదా ఇతరత్రా ఏ టెలికం ఆపరేటరు ఇంటర్నెట్‌ సర్వీస్‌నైనా ఉపయోగించుకుని దేశవ్యాప్తంగా ఏ టెలిఫోన్‌ నంబరుకైనా ఈ యాప్‌ ద్వారా అపరిమితమైన కాల్స్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం కూడా మొబైల్‌ యాప్స్‌ ద్వారా వాయిస్‌ కాల్స్‌ చేసుకునే వీలున్నప్పటికీ, సదరు యాప్‌ను ఉపయోగిస్తున్న వారికి మాత్రమే చేసే అవకాశం ఉంది.  

త్వరలో రిజిస్ట్రేషన్స్‌ ప్రారంభం.. 
మరికొద్ది రోజుల్లో రిజిస్ట్రేషన్స్‌ ప్రారంభిస్తామని, జూలై 25 నుంచి అధికారికంగా సర్వీసులు అందుబాటులోకి వస్తాయని బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ అనుపమ్‌ శ్రీవాస్తవ తెలిపారు. ‘వింగ్స్‌ యాప్‌ను ఉపయోగించి కస్టమర్లు.. భారత్‌లోని నంబర్లకు విదేశాల నుంచి కూడా కాల్‌ చేయొచ్చు. ఇంటర్నెట్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఈ యాప్‌ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు. కాల్స్‌ చేసుకోవచ్చు. దేశీయంగా అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ కోసం వార్షికంగా రూ. 1,099 ఫీజు ఉంటుంది‘ అని ఆయన చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ జారీ చేసే మొబైల్‌ నంబరుకు ఈ యాప్‌ అనుసంధానమై ఉంటుందని తెలిపారు.  

ఐడియా–వొడాఫోన్‌ విలీనానికి ఆమోదం.. 
ప్రైవేట్‌ టెలికం దిగ్గజాలు ఐడియా సెల్యులార్, వొడాఫోన్‌ ఇండియా విలీన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపిందని మనోజ్‌ సిన్హా చెప్పారు. అయితే, రెండు కంపెనీలూ ఇంకా కొన్ని లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉందని, ఆ తర్వాత తుది ఆమోదముద్ర లభిస్తుందని వివరించారు. డీల్‌కు పూర్తి స్థాయిలో అనుమతులివ్వాలంటే వొడాఫోన్‌ ఇండియాకు చెందిన స్పెక్ట్రం కోసం ఐడియా రూ. 3,976 కోట్లు కట్టాలని, ఇరు సంస్థలు రూ. 3,342 కోట్ల మేర బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని టెలికం శాఖ షరతులు విధించిన సంగతి తెలిసిందే. కానీ ఐడియా, వొడాఫోన్‌ వీటిని కోర్టులో సవాలు చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఐడియా, వొడాఫోన్‌లు విలీనమైతే దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల నికర విలువ, 35 శాతం మార్కెట్‌ వాటా, 43 కోట్ల యూజర్లతో దేశీయంగా అతి పెద్ద టెలికం సంస్థ ఆవిర్భవించనుంది. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లాభాల ప్రారంభం : ఊగిసలాటలో స్టాక్‌మార్కెట్లు

ఏడాదిలో ఐపీఓకి! 

రీట్, ఇన్విట్‌లకు ఇక డిమాండ్‌!

మూడో రోజు మార్కెట్లకు నష్టాలే

చైనాలో అమెజాన్‌ ఈ–కామర్స్‌ సేవలు నిలిపివేత

ఏసీసీ లాభం జూమ్‌

కొత్త ‘ఆల్టో 800’  

మార్కెట్లోకి హోండా ‘అమేజ్‌’ కొత్త వేరియంట్‌

జెట్‌ పునరుద్ధరణపై ఆశలు

ఫార్మా ఎగుమతులు 11% అప్‌

ఇరాన్‌ చమురుకు చెల్లు!

కేబుల్‌ టీవీ విప్లవం : జియో మరో సంచలనం

జియోలోకి సాఫ్ట్‌బ్యాంక్‌ ఎంట్రీ!

వరంగల్‌లో రిల‌య‌న్స్ స్మార్ట్‌ స్టోర్‌

మలబార్‌ గోల్డ్‌ ‘బ్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’

బజాజ్‌ నుంచి ‘హెల్త్, లైఫ్‌’ పాలసీ

మహింద్రా లైఫ్‌స్పేస్‌  లాభం 35 శాతం డౌన్‌ 

వెబ్‌సైట్, యాప్‌ లేకపోయినా చెల్లింపులు

పవన్‌హన్స్‌లో ఆగిన వాటాల విక్రయం

మార్కెట్లకు చమురు సెగ 

రెండు వారాల  కనిష్టానికి రూపాయి

హైదరాబాద్‌లో ఫ్లిప్‌కార్ట్‌ డేటా సెంటర్‌ 

స్మార్ట్‌ హైబ్రిడ్‌ టెక్నాలజీ ‘బాలెనో’ 

బ్రూక్‌ఫీల్డ్‌ చేతికి హైదరాబాద్‌ కంపెనీ?

ఎస్‌బీఐ జనరల్‌ నుంచి సైబర్‌ బీమా పాలసీ

బ్లాక్‌స్టోన్‌ చేతికి ఎస్సెల్‌ ప్రోప్యాక్‌

జెట్‌ సిబ్బందికి ప్రత్యేక రుణాలివ్వండి

సెప్టెంబర్‌ కల్లా రెండు రైల్వే ఐపీఓలు!

లైవ్‌ క్లాస్‌లతో కాసుల వర్షం

హోండా ‘సీబీఆర్‌650ఆర్‌’ స్పోర్ట్స్‌ బైక్‌ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అల్లుడి కోసం రజనీ

బిందుమాధవికి భలేచాన్స్‌

అధర్వ, హన్సిక చిత్రానికి డేట్‌ ఫిక్స్‌

‘దర్బార్‌’లో నయన్‌ ఎంట్రీ

స్వీట్‌ సర్‌ప్రైజ్‌

ట్రైలర్‌ బాగుంది  – ప్రభాస్‌