బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో బంపర్‌ ఆఫర్‌.. 

30 Mar, 2020 17:36 IST|Sakshi

న్యూఢిల్లీ : కరోనా కట్టడిలో భాగంగా దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ.. ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ వినియోగదారుల మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరిట ల్యాండ్‌లైన్‌ వినియోగదారుల కోసం బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా లాక్‌డౌన్‌ సమయంలో మొబైల్‌ సబ్‌స్కైబర్స్‌కు వెసులుబాటు కలిగించేలా ఒక ప్రకటన చేసింది. ఉచితంగా వ్యాలిడిటీని పొడగించడంతోపాటు, టాక్‌టైమ్‌ను ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఈ సమయంలో రీచార్జ్‌ చేసుకోవడం కుదరని వారికి ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. 

మర్చి 20 తర్వాత వ్యాలిడిటీ అయిపోయిన మొబైల్‌ వినియోగదారులకు ఏప్రిల్‌ 20 వరకు ఉచితంగా వ్యాలిడిటీని పొడిగించనున్నట్టు ప్రకటించింది. అలాగే లాక్‌డౌన్‌ కాలంలో వినియోగదారుల బ్యాలెన్స్‌ జీరోకు చేరితే.. వారికి 10 రూపాయల ఉచిత టాక్‌టైమ్‌ అందించనున్నట్టు తెలిపింది. ‘ఈ కష్ట సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు మద్దతుగా నిలుస్తుంది. వినియోగదారు రీచార్జ్‌ చేసుకోవడానికి డిజిటల్‌ పద్దతులు అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందుకు మై బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్‌ యాప్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ వాలెట్‌ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి’ అని బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ ప్రవీణ్‌ కుమార్‌ పూర్వర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు